డైరెక్టర్ అనిల్ కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. రోజా, శ్రీకాంత్ ముందే రెచ్చిపోయాడుగా..

టాలీవుడ్ లో దర్శకధీరుడు రాజమౌళి తర్వాత అపజయమెరగని దర్శకుడు ఎవరంటే అనిల్ రావిపూడి అనే చెప్పాలి. వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు తాజాగా వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన సినిమా వల్ల కాదు.. బుల్లితెర కామెడీ షోలో జరిగిన ఓ సంఘటన కారణంగా. ఓ షోలో సుడిగాలి సుధీర్, అనిల్ రావిపూడి లో ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఒకరి కాలర్ ఒకరు పట్టుకోవడం షాకింగ్ గా మారింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ప్రేక్షకులు నిజంగానే ఇద్దరి మధ్య గొడవ జరిగిందా? అంటూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది?

Also Read
Lenin 11 Days BoxOffice: అఖిల్‌ దెబ్బకి బాక్సాఫీస్ షేక్‌.. లెనిన్‌ మూవీకి ఎన్ని కోట్లంటే ?
Lenin 11 Days BoxOffice: అఖిల్‌ దెబ్బకి బాక్సాఫీస్ షేక్‌.. లెనిన్‌ మూవీకి ఎన్ని కోట్లంటే ?

ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాలతో బిజీగా ఉంటూనే 'డ్రామా జూనియర్స్' షోలో జడ్జిగా కనిపిస్తున్నారు. రోజా, శ్రీకాంత్ కూడా ఈ షోలో జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రతి వారం వీరిద్దరి మధ్య జరిగే సరదా సంభాషణలు షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ షోకు సంబంధించిన ఓ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ఈ ఘర్షణ హైలెట్ గా మారింది.

Sudigali Sudheer Grabs Anil Ravipudi s Collar in Drama Juniors Promo

తాజా ఎపిసోడ్‌లో సూపర్ హిట్ సినిమా 'అనిమల్' స్ఫూర్తితో ఓ స్పూఫ్ స్కిట్ క్రియేట్ చేశారు. స్కిట్‌లో భాగంగా సుధీర్.. "సార్.. మీ సినిమాలో నాకు ఒక అవకాశం ఇవ్వండి" అని అనిల్ రావిపూడిని అడుగుతాడు. దానికి అనిల్ తనదైన కామెడీ టైమింగ్‌తో స్పందిస్తూ.. "నువ్వు హీరో అయ్యావ్.. మళ్లీ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తావా?" అంటూ సుధీర్ షర్ట్ కాలర్ పట్టుకుంటాడు. ఈ సీన్ పూర్తిగా ఫన్నీగా సాగింది.

Recommended For You
Ramayana Trailer Review: 'రామాయణ' ట్రైలర్‌పై అట్లీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవిపై కామెంట్స్!
Ramayana Trailer Review: 'రామాయణ' ట్రైలర్‌పై అట్లీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవిపై కామెంట్స్!

ఆ తర్వాత సుధీర్ రోల్స్ రివర్స్ చేద్దామని చెప్పడంతో సీన్ కూడా మారిపోయింది. అనిల్ సుధీర్ పాత్రలో, సుధీర్ అనిల్ పాత్రలో నటిస్తారు. ఈసారి అనిల్.. "సార్.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి" అని అడగగా.. సుధీర్ ఒక్కసారిగా పాత్రలోకి వెళ్లి.. "ఏయ్.. నీకు ఎన్నిసార్లు చెప్పాలి?" అంటూ రెచ్చిపోయాడు. అంతేకాకుండా అనిల్ రావిపూడి కాలర్ పట్టుకుని గట్టిగా అరిచేస్తాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఈ ప్రోమోలో ఆ సీన్‌ను బ్లాక్ అండ్ వైట్‌లో చూపిస్తూ మరింత ఉత్కంఠ పెంచారు.

You May Also Like
ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్'లో హీరోయిన్ ఫిక్స్? త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..
ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్'లో హీరోయిన్ ఫిక్స్? త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..

ఈ సన్నివేశాన్ని చూసి జడ్జీలు రోజా, శ్రీకాంత్ కూడా షాక్ అయినట్లు కనిపించారు. అయితే, అది కూడా స్కిట్‌లో భాగమేనని తర్వాత అర్థమవుతుంది. ప్రోమోను అదే సమయంలో కట్ చేయడంతో, అసలు తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే అనే ఆసక్తిని మేకర్స్ కలిగించారు. ఈ ప్రోమో విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. "అనిల్ రావిపూడి - సుధీర్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది, ప్రోమో కట్ చేసిన విధానం సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు మొదట నిజంగానే గొడవ జరిగిందేమో అనుకున్నామని, తర్వాత అది సరదా స్కిట్ అని తెలిసి నవ్వుకున్నామని చెబుతున్నారు.

24 గంటల ఫుటేజ్‌ను గంటలో ఎలా చూపిస్తారు ? బిగ్ బాస్‌పై లేడీ కామెడియన్ షాకింగ్ కామెంట్స్..
24 గంటల ఫుటేజ్‌ను గంటలో ఎలా చూపిస్తారు ? బిగ్ బాస్‌పై లేడీ కామెడియన్ షాకింగ్ కామెంట్స్..

ఇదిలా ఉంటే, సుడిగాలి సుధీర్ ప్రస్తుతం హీరోగా కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన GOAT విడుదలకు సిద్ధంగా ఉండగా, 'హైలెస్సో' షూటింగ్ దశలో ఉంది. మరోవైపు టాలీవుడ్ లో దర్శకధీరుడు రాజమౌళి తర్వాత అపజయమెరగని దర్శకుడు ఎవరంటే అనిల్ రావిపూడినే అని చెప్పవచ్చు. ఈ డైరెక్టర్ ఇప్పటివరకు 9 సినిమాలు తెరకెక్కించగా.. అన్ని సినిమాలు సూపర్ హిటే.. మొదటి సినిమా పటాస్ మొదలుకుని ఇప్పటి మన శంకరవరప్రసాద్ గారు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లే. ఇప్పుడు తన 10 సినిమాను విక్టరీ వెంకటేష్- కళ్యాణ్ రామ్ లతో మల్టీ స్టారర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సంక్రాంతికి మరో హిట్ అందుకోవడం ఖాయమనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X