అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా.. మనసులో మాట చెప్పిన భాగ్యశ్రీ బోర్స్
మోస్ట్ బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోడలింగ్ రంగం నుండి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ.'మిస్టర్ బచ్చన్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. తన అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. తర్వాత విజయ్ దేవరకొండ 'కింగ్ డమ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత రామ్ పోతినేనితో కలిసి 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో నటించి మెప్పించింది. తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈ ముద్దుగుమ్మ తన పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా తన మనసులో మాటను బయటపెట్టింది. ఇంతకీ ఏమన్నారంటే?
అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా 'లెనిన్'. యంగ్ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా మనం ఎంటర్‌ప్రైజెస్,సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేశ్ ఇందిరా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. నవీన్ నూలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. టీజర్, ట్రైలర్, పాటలతో మంచి బజ్‌ను సొంతం చేసుకున్న 'లెనిన్' భారీ అంచనాల మధ్య జూలై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది.

రాపిడ్ ఫైర్‌లో ట్విస్ట్
ఇటీవల 'లెనిన్' సినిమా ప్రమోషన్ల సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. భాగ్యశ్రీకి యాంకర్ 'ఫ్రెండ్, మ్యారీ, డేట్' అనే రాపిడ్ ఫైర్ టాస్క్ ఇచ్చారు. టాలీవుడ్ హీరోల్లో ఎవరితో స్నేహం చేస్తారు?ఎవరితో డేటింగ్‌కు వెళ్తారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అని ప్రశ్నించగా.. ఆమె సరదాగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా 'లెనిన్' హీరో అఖిల్ అక్కినేని గురించి మాట్లాడుతూ.. "అఖిల్ చాలా మంచి వ్యక్తి. సెట్స్‌లో ఎంతో సపోర్టివ్‌గా ఉంటారు. అందుకే ఆయనను ఫ్రెండ్‌గా ఎంచుకుంటాను" అని భాగ్యశ్రీ తెలిపారు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఒక్కరే
అయితే, ఇంట్రెస్టింగ్ ఆన్సర్ పెళ్లి ప్రశ్న దగ్గర వచ్చింది. తాను ఇప్పటివరకు నటించిన కో-స్టార్స్‌లో చాలామందికి ఇప్పటికే పెళ్లి అయిపోయిందని చెప్పిన భాగ్యశ్రీ.. "ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకే ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మిగిలి ఉన్నారు. ఆయనే..." అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఆమె ఎవరి పేరు చెప్పకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం అది రామ్ పోతినేనిని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఆ రూమర్లకు మరింత ఊతం..
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే కలిసి'ఆంధ్ర కింగ్ తాలూకా'చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో పరిచయం ప్రేమగా మారిందనీ, అప్పటి నుంచి వీరిద్దరిపై డేటింగ్ రూమర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరూ వేరు వేరుగా ఒకే ఫ్లేస్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం వంటి అంశాలు కూడా అప్పట్లో చర్చకు దారితీశాయి. ఇప్పుడు భాగ్యశ్రీ చేసిన ఈ కామెంట్స్ తో ఆ రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మొత్తానికి వీరిద్దరి రూమర్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.


Click it and Unblock the Notifications



