టాక్సిక్ కోసం నయనతార భారీ రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే?
సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం సాగించినా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ బాక్సాఫీస్ వద్ద తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవల 'మన శంకర వరప్రసాద్ గారు'తో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న నయన్.. ఇప్పుడు కన్నడ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్'తో ముందుకు రాబోతున్నారు. నయనతార పోషించిన పాత్రపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం ఎంత పారితోషికం తీసుకుందనేది సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్'(Toxic). ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా విడుదలకు ముందే కథ, లుక్‌లు, బడ్జెట్‌తో పాటు ఇప్పుడు నటీనటుల పారితోషికాలు కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమా ఆగస్ట్ 26న థియేటర్లలోకి రానుంది. దీంతో వరుసగా ఒక్కొక్క ప్రమోషనల్ కంటెంట్‌ని వరసగా వదులుతున్నారు. గతవారం హీరోయిన్లకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయగా.. తాజాగా యష్-కియారా అడ్వాణీల రొమాంటిక్ సాంగ్ వీడియోని విడుదల చేశారు.

నయనతార రెమ్యూనరేషన్ ఎంతంటే?
'టాక్సిక్' సినిమా కోసం నయనతార భారీ పారితోషికం అందుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొదట ఆమె 18 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు, అనంతరం నిర్మాతలతో జరిగిన చర్చల తర్వాత 12 కోట్ల రూపాయల పారితోషికానికి అంగీకరించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మూవీ మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆమె పాత్ర ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని 12 నుంచి 15 కోట్ల రూపాయల మధ్య రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
సినీ వర్గాల టాక్ ప్రకారం.. ఈ సినిమాలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా హీరో యశ్ నిలిచారు.ఈ సినిమా కోసం ఆయనకు ఏకంగా 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 'కేజీఎఫ్'సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఈ స్థాయి పారితోషికం చెల్లించారని టాక్ వినిపిస్తోంది. ఇక హీరోయిన్ కియారా అద్వానీ ఈ సినిమా కోసం 15 కోట్ల రూపాయలు అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్‌లో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న కియారా, 'టాక్సిక్'లో కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఈ చిత్రం కోసం 3నుంచి 5 కోట్ల రూపాయలు అందుకున్నట్లు సమాచారం. అదే విధంగా బాలీవుడ్ నటీమణులు తారా సుతారియా, హ్యూమా ఖురేషిలకు చెరో 2 కోట్ల రూపాయల వరకు పారితోషికం చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పారితోషికాల వివరాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. విడుదలకు ముందే బడ్జెట్, స్టార్ కాస్ట్, రెమ్యూనరేషన్‌లతో వార్తల్లో నిలుస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications



