మెగా ఫ్యాన్స్‌కు పవన్ కళ్యాణ్ భార్య రిక్వెస్ట్.. అలా పిలవొద్దంటూ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)భార్య అన్నా కొణిదెల (Anna Lezhneva)ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరచిన సంగతి తెలిసిందే! ఆమె తక్కువ సమయంలోనే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇందులో తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంతో పాటు అరుదైన ఫొటోలు, వ్యక్తిగత జ్ఞాపకాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇలా ఆమె సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా మారారు. ఇదిలా ఉంటే తాజాగా తన పేరుకు సంబంధించిన ఓ ముఖ్యమైన విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

Also Read
మనిద్దరం పెళ్లి చేసుకుందామా?.. యాంకర్‌కు హీరో నవదీప్ షాకింగ్ ప్రపోజల్!
మనిద్దరం పెళ్లి చేసుకుందామా?.. యాంకర్‌కు హీరో నవదీప్ షాకింగ్ ప్రపోజల్!

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించిన అన్నా.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా కోలుకుంటారని చెప్పారు. దీంతో మెగా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆ తర్వాత చేసిన మరో పోస్ట్ ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది. తన పుట్టినరోజు సమీపిస్తున్న సందర్భంగా చాలా రోజులుగా మనసులో ఉన్న విషయాన్ని చెప్పాలని నిర్ణయించుకున్నట్లు అన్నా వెల్లడించారు.

Recommended For You
Jana Nayagan Day 5 Collections: జన నాయగన్ ర్యాంపేజ్.. దళపతి విజయ్ సినిమాకి ఎన్ని కోట్లంటే?
Jana Nayagan Day 5 Collections: జన నాయగన్ ర్యాంపేజ్.. దళపతి విజయ్ సినిమాకి ఎన్ని కోట్లంటే?
Pawan Kalyan Wife Anna Konidela Requests Mega Fans

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించినప్పటి నుంచే ఈ విషయం చెప్పాలని అనుకున్నానని అన్నా తెలిపారు. ఎన్నోసార్లు పోస్ట్ రాసి మళ్లీ డిలీట్ చేశానని, ఎలా చెప్పాలో అర్థం కాక చాలా రోజులు ఆలోచించానని పేర్కొన్నారు. "ఒక వ్యక్తికి పేరు అనేది చాలా ముఖ్యమైన విషయం. అది కేవలం పిలిచే పేరు కాదు. మన గుర్తింపు. మన వ్యక్తిత్వంలో భాగం. అందుకే ఈ విషయాన్ని చెప్పడానికి ఇంత సమయం తీసుకున్నాను" అని అన్నా తన పోస్టులో పేర్కొన్నారు.

You May Also Like
'నేను ఆట బొమ్మను కాదు.. అలాంటి ఆఫర్లు అక్కర్లేదు’
'నేను ఆట బొమ్మను కాదు.. అలాంటి ఆఫర్లు అక్కర్లేదు’

అందరూ తనను 'అన్నా లెజ్నేవా' అనే పేరుతోనే తెలుసుకున్నారని ఆమె గుర్తు చేశారు. ఆ పేరు మీడియా కథనాల్లో, సోషల్ మీడియాలో, అభిమానుల మధ్య ప్రచారంలోకి వచ్చిందని చెప్పారు. అందుకే ఇప్పటికీ చాలా మంది అదే పేరుతో తనను పిలుస్తున్నారని తెలిపారు. అయితే అందులో ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా ఆమె వెల్లడించారు. "మా పెళ్లి సర్టిఫికేట్‌లో మాత్రమే 'అన్నా లెజ్నేవా' అనే ఇంటిపేరు చివరిసారిగా ఉంది. అదే ఆ పేరు ఉన్న చివరి అధికారిక పత్రం"అని తెలిపారు. పెళ్లి జరిగిన రోజే తన భర్త ఇంటిపేరు స్వీకరించానని పేర్కొన్నారు.

52 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో మలైకా అరోరా? 19ఏళ్ల చిన్నవాడితో...
52 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో మలైకా అరోరా? 19ఏళ్ల చిన్నవాడితో...

"ఆ రోజు నుంచి నేను అధికారికంగా అన్నా కొణిదెల అయ్యాను. అదే నా పేరు. అదే నా గుర్తింపు. ఆ పేరుతోనే నేను నన్ను నేను గుర్తించుకుంటాను. ఆ పేరుతోనే నాకు ఆత్మీయత అనిపిస్తుంది" అంటూ ఆమె భావోద్వేగంగా రాశారు. ఈ సందర్భంగా మెగా అభిమానులకు ఆమె ఓ అభ్యర్థన కూడా చేశారు. "మీరు ఈ పోస్ట్ ఇంతవరకు చదివి ఉంటే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. దయచేసి ఇకపై నన్ను 'అన్నా కొణిదెల' అని పిలవండి. అదే నా పేరు. అదే నన్ను నేను అనిపించే పేరు" అంటూ ఫ్యాన్స్‌ను కోరారు.

యాంకర్ రష్మీని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ.. ఇన్నాళ్లు ఈగోలు అడ్డొచ్చాయంటూ..
యాంకర్ రష్మీని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ.. ఇన్నాళ్లు ఈగోలు అడ్డొచ్చాయంటూ..

అలాగే ఈ పోస్ట్‌కు జత చేసిన ఫొటో గురించి కూడా ఆమె ప్రత్యేకంగా వివరించారు. "ఈ ఫొటోను నేను, నా భర్త కలిసి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్లిన తొలి పర్యటనలో తీసుకున్నాం. ఆ జ్ఞాపకం నాకు ఎంతో ప్రత్యేకం" అని పేర్కొన్నారు. అన్నా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. "ఇకపై మిమ్మల్ని అన్నా కొణిదెలగానే పిలుస్తాం", "మీ కోరికను గౌరవిస్తాం", "కొణిదెల కుటుంబ సభ్యురాలిగా మీ గుర్తింపును గౌరవిస్తున్నాం" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X