Jana Nayagan Day 5 Collections: జన నాయగన్ ర్యాంపేజ్.. దళపతి విజయ్ సినిమాకి ఎన్ని కోట్లంటే?
Jana Nayagan Box Office Collections: తమిళనాడు సీఎం విజయ్ హీరోగా నటించిన సినిమా 'జన నాయగన్'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. జూలై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే భారీ కలెక్షన్లను నమోదు చేసింది. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, ఇప్పుడు వాటికి తగ్గట్టుగానే వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది? ఇప్పటి వరకూ ఎంత కలెక్ట్ చేసింది? ఐదో రోజు అంచనా కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, మమితా బైజు కీలక పాత్ర పోషించారు. బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందు ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తమిళనాడులో థియేట్రికల్ హక్కులు 105 కోట్ల రూపాయలకు, ఇతర ప్రాంతాల హక్కులు 95 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. దీంతో మొత్తం థియేట్రికల్ బిజినెస్ విలువ 200 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవాలంటే సుమారు 200 కోట్ల రూపాయల షేర్, దాదాపు 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సిన పరిస్థితి ఉంది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 5,000 స్క్రీన్లలో, 12,000 షోలతో గ్రాండ్‌గా విడుదలైంది. తొలి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించింది. మొదటి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 42.70 కోట్ల రూపాయల నెట్, 50.28 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఓవర్సీస్‌లో కూడా భారీ స్పందన లభించింది. తొలి రోజే ఓవర్సీస్ నుంచి సుమారు 30 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు అంచనా. దాంతో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 85.04 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
సినిమాకు విడుదలైన మొదటి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, అది కలెక్షన్లపై పెద్దగా ప్రభావం చూపలేదు. విజయ్ స్టార్‌డమ్ కారణంగా రెండో రోజు కూడా మంచి వసూళ్లు నమోదయ్యాయి. రెండో రోజు ఇండియాలో 21.15 కోట్ల రూపాయల నెట్, 24.72 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. మూడో రోజు వీకెండ్ ప్రభావంతో సినిమా కలెక్షన్లు మళ్లీ పుంజుకున్నాయి. ఆరోజు 28.90 కోట్ల రూపాయల నెట్, 33.81 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్లకు రావడంతో వసూళ్లు మరింత పెరిగాయి. ఇక నాలుగో రోజు కూడా సినిమా అదే జోరు కొనసాగించింది. నాలుగో రోజు 32 కోట్ల రూపాయల నెట్, 37.17 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.
వీకెండ్ ముగిసే సమయానికి సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్‌ను కొనసాగించింది. ఇలా నాలుగు రోజుల్లో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం 124.75 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను నమోదు చేసింది. అలాగే 145.98 కోట్ల రూపాయల ఇండియా గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో కూడా విజయ్ క్రేజ్ స్పష్టంగా కనిపించింది. విదేశీ మార్కెట్ల నుంచి ఈ సినిమా దాదాపు 71.50 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. దీంతో నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం 217.48 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. కొన్ని ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ మొత్తం 218 కోట్ల రూపాయలకు చేరినట్లు వెల్లడించారు.
భాషల వారీగా చూస్తే తమిళ వెర్షన్ నుంచి 108.25 కోట్ల రూపాయల నెట్, తెలుగు వెర్షన్ నుంచి 6.85 కోట్ల రూపాయల నెట్, హిందీ వెర్షన్ నుంచి 9.65 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. దీంతో తమిళ మార్కెట్ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారింది. ఓవర్సీస్‌లో కూడా సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూకే, న్యూజిలాండ్, గల్ఫ్ దేశాల్లో విజయ్ అభిమానులు సినిమాకు భారీ ఆదరణ చూపుతున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటి వరకు 71.50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించడం విశేషంగా మారింది. ఇదిలా ఉంటే...
ఇక 5 రోజు అంచనా కలెక్షన్లు చూస్తే..
తొలి నాలుగు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా, ఐదో రోజు కూడా కలెక్షన్లు కాస్త తగ్గే అవకాశముంది. ట్రేడ్ వర్గాల ( సాక్నిక్) సమాచారం ప్రకారం.. ఐదో రోజు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 5,400 షోలలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకు మధ్నాహ్యం 2 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం.. 2. 59 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ట్రెండ్ గమనిస్తే.. సాయంత్రం, రాత్రి షోల బుకింగ్స్ కాస్త ఆశాజనకంగా కనిపిస్తోంది.
ఫస్ట్, సెంకడ్ షో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్క చూస్తే ఐదో రోజు సుమారు 15 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఈ లెక్కన చూస్తే.. ఇండియా నెట్ కలెక్షన్లు 135 కోట్ల రూపాయలకు, గ్రాస్ కలెక్షన్లు 160 కోట్ల రూపాయలకు చేరువ కానున్నాయి. ఈ సినిమా క్రేజ్ చూస్తే.. అతి తర్వలోనే 250 కోట్ల మార్క్ చేరువ కానున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications





