Payal Rajput: నెటిజన్‌ తింగరి ప్రశ్న... పాయల్ రాజ్‌పుత్ స్ట్రాంగ్ వార్నింగ్

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ తన క్రియేటర్స్ కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా ఉన్నవారికి ఆదాయం అందేలా ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌కి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చింది. దీని ద్వారా సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా భారీగా సంపాదిస్తున్నారు. అయితే కొందరు హీరోయిన్లు, ఇతర నటీమణులు ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పేరుతో హాట్ కంటెంట్‌ను షేర్ చేస్తుండం వివాదాస్పదమవుతోంది.

Also Read
Lenin First Review: లెనిన్ మూవీ ఫస్ట్ రివ్యూ
Lenin First Review: లెనిన్ మూవీ ఫస్ట్ రివ్యూ

తెలుగు బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి భారీగా సంపాదిస్తోంది. దీనిపై విమర్శలు రావడంతో పాటు పోలీసులకు ఫిర్యాదులు కూడా ఇవ్వడంతో వివాదాస్పదమైంది. ఒక్క విష్ణుప్రియ మాత్రమే కాదు.. ఈ సబ్‌స్క్రైబర్స్ ప్లాన్‌ను కొందరు హీరోయిన్లు, లేడీ ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ స్కిన్ షోకి వేదికగా మార్చుకున్నారు. బోల్డ్ ఫోటోలు, అశ్లీలమైన వీడియోలను వదులుతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఫాలో అవుతూ... నెలకు లక్షల్లో సంపాదిస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఎక్స్‌క్లూజివ్‌గా కొందరికే ఇలాంటి కంటెంట్ షేర్ చేస్తున్నామని సెలబ్రిటీలు సమర్ధించుకుంటున్నా.. స్క్రీన్ రికార్డింగ్, స్క్రీన్ షాట్లతో ఇవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Payal Rajput Gives Strong Reply to Fans Demanding Private Content on Instagram Subscription

అయితే ఇలాంటి సబ్‌‌స్క్రిప్షన్ తీసుకున్న వారి ఆగడాలు పెరిగిపోతున్నాయి. తాము డబ్బు ఖర్చుపెట్టి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటున్నందుకు గాను.. తాము కోరిన కంటెంట్ అందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అశ్లీల ఫోటోలు, వీడియోలు కావాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఇలాంటి వారికి బాధితులుగా మారారు. తాజాగా స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా ఈ లిస్ట్‌లోకి చేరారు.

Recommended For You
Lenin Pre Release Review: లెనిన్ మూవీ ప్రీ రిలీజ్ రివ్యూ
Lenin Pre Release Review: లెనిన్ మూవీ ప్రీ రిలీజ్ రివ్యూ

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే పాయల్ రాజ్‌పుత్ ఎప్పటికప్పుడు తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వివరాలను అభిమానులను పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల తన ఫాలోవర్స్ కోసం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చారు. తన దగ్గరున్న ఎక్స్‌క్లూజింట్ కంటెంట్ కావాలనుకునేవారు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీని సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని ఆమె సూచించారు. దీనికి భారీగా రెస్పాన్స్ వచ్చి పాయల్‌కు సబ్‌స్క్రైబర్లు పెరిగారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ తమకు ప్రైవేట్ కంటెంట్, హాట్ పిక్స్, బోల్డ్ కంటెంట్ కావాలని డిమాండ్ చేస్తూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై స్పందించిన పాయల్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు.

You May Also Like
'నా భర్తకు 50 మందితో అఫైర్.. అయినా వదిలిపెట్టను’
'నా భర్తకు 50 మందితో అఫైర్.. అయినా వదిలిపెట్టను’

నా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కంటెంట్‌ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు నా దగ్గరి నుంచి బోల్డ్ కంటెంట్ ఆశిస్తూ సబ్‌స్క్రైబ్ చేసుకుని ఉంటే ఇది మీరు అనుకున్న ఛానెల్ కాదు. కేవలం తెర వెనుక నా నిజ జీవితాన్ని, నా అన్‌ఫిల్టర్డ్ క్షణాలను, నా రోజువారీ ప్రయాణాన్ని పంచుకోవడానికే ఈ ఛానెల్ ఏర్పాటు చేశా. నన్ను ఒక వ్యక్తిగా ఇష్టపడేవారికే ఇందులో స్వాగతం పలుకుతున్నా. ఒక మహిళగా, నా పరిమితులను అర్ధం చేసుకుని నన్ను గౌరవించే ప్రతి అభిమానికి ధన్యవాదాలు తెలియజేశారు పాయల్ రాజ్‌పుత్. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం తమిళంలో గోల్‌మాల్, తెలుగులో కిరాతక సినిమాలలో నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X