Lenin Pre Release Review: లెనిన్ మూవీ ప్రీ రిలీజ్ రివ్యూ

యువ హీరో, హీరోయిన్లు అఖిల్, భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన లవ్, ఎమోషనల్, డివోషనల్ రూరల్ డ్రామా లెనిన్. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పిస్తున్నది. ఈ చిత్రంలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేశ్ ఇందిరా తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే. సినిమాటోగ్రఫి: లియోన్ బ్రిట్టో, మ్యూజిక్ డైరెక్టర్: థమన్ ఎస్, ఎడిటర్: నవీన్ నూలీ, యాక్షన్ కోరియోగ్రఫి: దిలీప్ సుబ్బరాయన్, రామ్ లక్ష్మణ్, విజయ్, రియల్ సతీష్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల, కొరియోగ్రఫి: దినేష్ మాస్టర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలు పెంచాయి. ఈ క్రమంలో ఈ సినిమాపై పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తున్నది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాల వివరాల్లోకి వెళితే..

Lenin Film Pre Release Review

చిత్తూరు జిల్లాలో శ్రీరామపురంలో ద్రౌపదీని కొలిచే ఓ సంప్రదాయాన్ని పాయింట్‌గా తీసుకొని మహాభారతం కాన్సెప్ట్‌తో భారతీ (భాగ్యశ్రీ భోర్సే) లెనిన్ (అఖిల్) ప్రేమ వ్యవహారం చుట్టూ కథ సాగుతుంది. వివిధ పర్వాలుగా సాగే ఈ కథలో వివిధ క్యారెక్టర్లు రంగులు మార్చే తీరు.. వెన్నుపోటు పొడిచే మోసాలు స్టోరిని ఇంటెన్స్‌గా నడిపిస్తుంది. భారతీ, లెనిన్ ప్రేమను బ్రేక్ చేయడానికి గ్రామంలో ఏ దుష్టశక్తులు ఎలాంటి కుట్రలు పన్నాయి? గ్రామంలో మహాభారత యుద్దాన్ని తలపించే వ్యవహారాన్ని లెనిన్ ఎలా ప్రశాంతంగా ముగించాడు అనేది ఈ సినిమా కథ అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Also Read
తమిళనాడులో ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్‌పై నిషేధం? త్రివిక్రమ్‌పై తీవ్ర ఆగ్రహం
తమిళనాడులో ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్‌పై నిషేధం? త్రివిక్రమ్‌పై తీవ్ర ఆగ్రహం

ఇప్పటి వరకు అర్బన్ యూత్‌కు ఫాలోవర్‌గా ఇప్పటి వరకు అఖిల్ పోషించిన పాత్రలకు, చేసిన సినిమాలకు భిన్నంగా ఈ మూవీ రూపొందింది. ఈ సినిమాలో పంచకట్టుతో గ్రామీణ యువకుడిగా లెనిన్ పాత్రలో కనిపించబోతున్నారు. తన ఇమేజ్ భిన్నంగా పక్కాగా గ్రామీణ యువకుడిగా, చిత్తూరు యాసను పలికే కుర్రాడిలా అఖిల్ కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమాకు లెనిన్ క్యారెక్టర్ బలంగా ఉండటమే కాకుండా సక్సెస్‌కు కారణం అవుతుంది అని ఈ సినిమా విజయంపై చిత్ర యూనిట్ విశ్వాసం ప్రకటించారు.

Recommended For You
Sing Geetham Closing Collections: సింగ్ గీతం క్లోజింగ్ కలెక్షన్లు.. నాగ్ అశ్విన్ మూవీకి లాభమా? నష్టమా?
Sing Geetham Closing Collections: సింగ్ గీతం క్లోజింగ్ కలెక్షన్లు.. నాగ్ అశ్విన్ మూవీకి లాభమా? నష్టమా?

ఇక ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలే కాకుండా పెర్ఫార్మెన్స్ పాత్రలతో ఆకట్టుకొంటున్న భాగ్య శ్రీ భోర్సే ఈ సినిమా కథను తన భుజాలపై మోసే భారతీ పాత్రలో కనిపిస్తారు. సినిమా మొత్తం భారతీ పాత్ర చుట్టే తిరుగుతుంది. శివాజీ, ఇతర పాత్రలు ఈ సినిమాకు అత్యంత బలంగా మారుతాయి. కథను ప్రభావితం చేసే పాత్రలుగా తెర మీద కొత్త అనుభూతికి గురి చేస్తాయనే టాక్ వినిపిస్తున్నది.

You May Also Like
Idhayam Murali Pre Release Review: హృదయం మురళీ ప్రీ రిలీజ్ రివ్యూ
Idhayam Murali Pre Release Review: హృదయం మురళీ ప్రీ రిలీజ్ రివ్యూ

ఇక ఈ సినిమాకు దర్శకుడు మురళీ కిషోర్ డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కొత్తగా ఉంటాయి అని నాగార్జున అక్కినేని స్వయంగా చెప్పారు. ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో ఎన్నడూ చూడని ఫ్రెష్‌నెస్ కనిపిస్తుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాలోని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేస్తాయనే విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది. రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X