నన్ను సినిమాల నుంచి కావాలనే తప్పించారు.. ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు బాలీవుడ్‌లో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన ఆమె.. ఇప్పుడు హాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి'లో నటిస్తున్నారు. భారీ పాన్ ఇండియా సినిమా షూటింగ్‌తో పాటు వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ప్రియాంక.. ఈ నేపథ్యంలో తన సినీ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. ఇంతకీ ఏమైందంటే..?

Also Read
35 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో రిపీట్.. చిరంజీవికి విలన్‌గా స్టార్ హీరో.. బాబీ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
35 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో రిపీట్.. చిరంజీవికి విలన్‌గా స్టార్ హీరో.. బాబీ మాస్టర్ ప్లాన్ ఇదేనా!

ప్రియాంక చోప్రా.. తన కెరీర్‌లో కొన్ని సినిమాలు ప్రతిభ ఆధారంగా కాకుండా, వ్యక్తిగత కారణాలతో కోల్పోయానని వెల్లడించారు. కొందరిని మెప్పించలేదనే కారణంతో, మరికొందరు చెప్పినట్లుగా తాను నడుచుకోలేదనే కారణంతో అవకాశాలు తన చేతి నుంచి జారిపోయాయని అన్నారు. ఈ విషయాల గురించి తాను ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడలేదని కూడా చెప్పారు. ప్రియాంక మాట్లాడుతూ.. "నాకు కొన్ని వ్యక్తిగత విలువలు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి అవకాశాల కోసం రాజీ పడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇతరులు చేసినట్లుగా నేను కూడా అందరినీ సంతృప్తిపరచే ప్రయత్నం చేయలేదు. అందుకే కొన్ని పెద్ద సినిమాలు నా చేతి నుంచి వెళ్లిపోయాయి" అని వెల్లడించారు.

Recommended For You
Top 10 Heroines: సమంత హవా.. నయనతారకు ఎదురుదెబ్బ.. కాజల్‌, రష్మిక, సాయిపల్లవి ర్యాంక్స్ ఇవే!
Top 10 Heroines: సమంత హవా.. నయనతారకు ఎదురుదెబ్బ.. కాజల్‌, రష్మిక, సాయిపల్లవి ర్యాంక్స్ ఇవే!
Priyanka Chopra Reveals Why She Lost Films

అంతేకాదు.. తనను కొందరు స్టార్ హీరోలు ఉద్దేశపూర్వకంగానే కొన్ని ప్రాజెక్టుల నుంచి తప్పించారని కూడా ఆమె పేర్కొన్నారు. అయితే ఎవరిపేర్లనూ ప్రస్తావించకుండా, జరిగిన సంఘటనలనే వివరించారు. 2007లో జరిగిన ఒక సంఘటనను కూడా ప్రియాంక గుర్తు చేసుకున్నారు. అప్పట్లో 'సలామ్-ఎ-ఇష్క్' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో మరో సినిమా కోసం తనను ఎంపిక చేశారని చెప్పారు. షూటింగ్ ప్రారంభానికి నెల రోజుల ముందు ఆ సినిమా హీరో తనను కలిసేందుకు వచ్చారని తెలిపారు.

You May Also Like
Top 10 Heroes: టాప్‌ 10 హీరోలు వీరే.. ప్రభాస్ నంబర్1.. రామ్ చరణ్ రైజ్.. ఎన్టీఆర్ కి షాక్..
Top 10 Heroes: టాప్‌ 10 హీరోలు వీరే.. ప్రభాస్ నంబర్1.. రామ్ చరణ్ రైజ్.. ఎన్టీఆర్ కి షాక్..

మొదట ఆయన షూటింగ్ గురించి మాట్లాడటానికి వచ్చారని అనుకున్నానని ప్రియాంక చెప్పారు. కానీ ఆయన చెప్పిన మాటలు తనను తీవ్రంగా షాక్‌కు గురి చేశాయని వెల్లడించారు. "ఈ పాత్ర నిజానికి మరో హీరోయిన్ కోసం అనుకున్నారు. పొరపాటున నీకు వచ్చింది. భవిష్యత్తులో మనం మరో సినిమా చేద్దాం" అని ఆ హీరో చెప్పినట్లు ఆమె వివరించారు. ఆ సంఘటన తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని ప్రియాంక తెలిపారు. అయితే ఆ సమయంలో ఎవరి మీదా కోపం పెట్టుకోకుండా, తన కెరీర్‌పై మాత్రమే దృష్టి పెట్టానని చెప్పారు. నటనలో మరింత మెరుగుపడాలని నిర్ణయించుకుని ముందుకు సాగానని వెల్లడించారు.

'జన నాయగన్‌' కోసం విజయ్‌కి రికార్డ్ రెమ్యునరేషన్! దళపతి చివరి మూవీకి పారితోషికం ఎన్ని కోట్లంటే?
'జన నాయగన్‌' కోసం విజయ్‌కి రికార్డ్ రెమ్యునరేషన్! దళపతి చివరి మూవీకి పారితోషికం ఎన్ని కోట్లంటే?

ఇలాంటి సంఘటన ఒక్కసారి మాత్రమే జరగలేదని, తన కెరీర్‌లో చాలాసార్లు ఎదురయ్యాయని కూడా ఆమె అన్నారు. అయినప్పటికీ అవకాశాల కోసం ఎప్పుడూ తన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టలేదని స్పష్టం చేశారు. "నా కష్టం, నా ప్రతిభ, నా పని మాత్రమే నన్ను ముందుకు తీసుకెళ్లాయి. ఎవరినీ నిందించడం నా ఉద్దేశం కాదు. కానీ నేను ఎదుర్కొన్న అనుభవాలు ఇవే" అని ప్రియాంక పేర్కొన్నారు. తర్వాత అమెరికాలో అవకాశాలు దక్కించుకుని, అక్కడ కూడా సక్సెస్ నటిగా గుర్తింపు పొందడం ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా మారింది.

సీఎం విజయ్ కోసం అనిల్ రావిపూడి రంగంలోకి.. జన నాయగన్ స్టోరీ వెనుక అసలు కథ ఇదే..
సీఎం విజయ్ కోసం అనిల్ రావిపూడి రంగంలోకి.. జన నాయగన్ స్టోరీ వెనుక అసలు కథ ఇదే..

ఈ అమ్మడు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 'వారణాసి' సినిమాతో చాలా కాలం తర్వాత భారతీయ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X