Top 10 Heroes: టాప్‌ 10 హీరోలు వీరే.. ప్రభాస్ నంబర్1.. రామ్ చరణ్ రైజ్.. ఎన్టీఆర్ కి షాక్..

Top 10 Heroes: ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన సినీ హీరోల జాబితాను ఓర్మాక్స్ మీడియా (Ormax Media)విడుదల చేసింది. తాజాగా జూన్ 2026 నెలకు సంబంధించిన ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఓర్మాక్స్‌ స్టార్స్ ఇండియా లవ్స్ (Ormax Stars India Loves)పేరుతో జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అభిరుచి, స్టార్‌డమ్, పాపులారిటీ ఆధారంగా రూపొందించిన ఈ ర్యాంకింగ్స్‌పై సినీ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈసారి టాలీవుడ్ హీరోలు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటడం విశేషంగా మారింది.

Also Read
షూటింగ్ లో బాలకృష్ణకు ప్రమాదం.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
షూటింగ్ లో బాలకృష్ణకు ప్రమాదం.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

ప్రభాస్‌కు ఎదురులేదు.. మరోసారి నంబర్ 1
ఈ జాబితాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ క్రేజ్ కొనసాగుతూనే ఉంది. 'బాహుబలి' తర్వాత ఆయనకు వచ్చిన జాతీయ స్థాయి గుర్తింపు ఇప్పటికీ తగ్గలేదు. ప్రస్తుతం చేతిలో భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న భారీ ఫాలోయింగ్ ఉంది. అలా ఆయన మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టింది. ఓర్మాక్స్ ర్యాంకింగ్స్‌లో వరుసగా టాప్‌లో కొనసాగుతూ ప్రభాస్ తన స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించారు.

Ormax India Top 10 Heroes June 2026 Prabhas Retains No 1 Ram Charan Climbs NTR Misses

RC 17: రామ్ చరణ్‌ మూవీలో స్టార్ హీరోయిన్‌.. సుకుమార్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా?
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈసారి కూడా రెండో స్థానంలో నిలిచారు. వరుస సినిమాలతో పాటు దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కొనసాగుతోంది. ఇక తమిళ స్టార్ దళపతి విజయ్ మూడో స్థానంలో నిలవడం విశేషం. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ ర్యాంకింగ్స్ చెబుతున్నాయి. గత నెలలో ఉన్న స్థానాలనే ఈసారి కూడా వీరిద్దరూ కొనసాగించడం గమనార్హం.

Recommended For You
నోరు జారితే అంతే.. జబర్దస్త్ సీక్రెట్ బయటపెట్టిన సత్యశ్రీ!
నోరు జారితే అంతే.. జబర్దస్త్ సీక్రెట్ బయటపెట్టిన సత్యశ్రీ!

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాలుగో స్థానంలో నిలిచారు. 'పుష్ప' సిరీస్‌తో దేశవ్యాప్తంగా ఏర్పడిన క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇటీవల కొత్త సినిమా అప్‌డేట్స్ పెద్దగా లేకపోయినా ఆయనకు ఉన్న అభిమాన గణం తగ్గలేదని ఈ ర్యాంకింగ్ స్పష్టం చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా బన్నీకి ఉన్న ఆదరణ ఆయనను టాప్-5లో నిలబెట్టింది.

రామ్ చరణ్‌కు భారీ జంప్..
ఈసారి ర్యాంకింగ్స్‌లో అత్యంత ఆసక్తికరమైన మార్పు రామ్ చరణ్ విషయంలో కనిపించింది. గత నెల ఏడో స్థానంలో ఉన్నరామ్ చరణ్ ఈసారి 2 స్థానాలను ఎగబాకి ఐదో స్థానంలో నిలిచారు. ఇటీవల విడుదలైన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడం, దేశవ్యాప్తంగా ఆ సినిమాపై చర్చ జరగడం ఆయన ర్యాంక్ పెరగడానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. పాన్ ఇండియా హీరోగా చరణ్ ఇమేజ్ మరింత పెరిగిందని ఈ ర్యాంకింగ్ స్పష్టం చేస్తోంది.

You May Also Like
అనిల్ రావిపూడి స్టైల్‌లో నాగ్ అశ్విన్.. డైరెక్టర్‌కు ప్రభాస్ క్లాస్..
అనిల్ రావిపూడి స్టైల్‌లో నాగ్ అశ్విన్.. డైరెక్టర్‌కు ప్రభాస్ క్లాస్..

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి ఆరో స్థానంలో నిలిచారు. గత నెలతో పోలిస్తే ఒక స్థానం దిగజారినా ఆయన పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదని అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్‌ వారణాసిలో నటిస్తుండటంతో ఆయనపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా విడుదలకు ముందే మహేష్ క్రేజ్ కొనసాగుతుండటం విశేషం.

సూర్య ఎంట్రీ.. ఎన్టీఆర్ ఔట్ కావడం షాక్
ఈసారి తమిళ స్టార్ సూర్య ఏడో స్థానంలో నిలిచారు. ఇటీవల విడుదలైన ఆయన సినిమా విజయంతో మళ్లీ పాపులారిటీ పెరిగింది. అయితే ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. గత కొన్ని నెలలుగా టాప్-10లో ఉన్న ఎన్టీఆర్ ఈసారి పూర్తిగా జాబితా నుంచి బయటకు రావడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అలాగే తమిళ స్టార్ అజిత్ కూడా ఈసారి టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు.

డైరెక్టర్ అనిల్ కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. రోజా, శ్రీకాంత్ ముందే రెచ్చిపోయాడుగా..
డైరెక్టర్ అనిల్ కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. రోజా, శ్రీకాంత్ ముందే రెచ్చిపోయాడుగా..

బాలీవుడ్ హీరోల హవా.. టాలీవుడ్ ఆధిపత్యం
జాబితాలో ఎనిమిదో స్థానంలో సల్మాన్ ఖాన్, తొమ్మిదో స్థానంలో అక్షయ్ కుమార్, పదో స్థానంలో రణ్‌వీర్ సింగ్ నిలిచారు. అయితే మొత్తం టాప్-10లో నలుగురు తెలుగు హీరోలు చోటు దక్కింది. దీని బట్టి చూస్తే.. టాలీవుడ్ హీరోలు మరోసారి తమ సత్తా చాటుకున్నారు. దక్షిణాది సినిమాల ప్రభావం నార్త్ ఇండియాలో ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ జాబితా స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతున్నాయి. అందుకే ఓర్మాక్స్ ర్యాంకింగ్స్‌లో కూడా టాలీవుడ్ హీరోలు వరుసగా ఆధిపత్యం చాటుతున్నారు.

Read more about: ram charan allu arjun prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X