బిగ్ సర్‌ప్రైజ్.. ప్రియాంక పాత్రపై రాజమౌళి క్లారిటీ.. అంచనాలు పెంచేశారుగా!

టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో 'వారణాసి' టాప్‌లో ఉంటుంది. దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ కెరీర్‌లో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. అలాంటి సినిమాలో బాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన మహేష్ ప్రీ-లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశారు. ఇప్పుడు ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.

Also Read
రెమ్యూనరేషన్ పెంచిన భాగ్య‌శ్రీ భోర్సే.. లెనిన్ హిట్ తర్వాత పారితోషికం ఎన్ని కోట్లంటే?
రెమ్యూనరేషన్ పెంచిన భాగ్య‌శ్రీ భోర్సే.. లెనిన్ హిట్ తర్వాత పారితోషికం ఎన్ని కోట్లంటే?

ప్రియాంక బర్త్ డే సందర్భంగా జూలై 18న ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. కొత్త పోస్టర్, ఆమె పాత్రపై చిన్న క్లారిటీ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. షూటింగ్ స్పాట్‌లో తీసిన ఫొటోలను పంచుకుంటున్నారు. 'ఆమె నవ్వితే అందం.. నవ్వకపోతే నిప్పు కణిక'అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఆమె పోషించిన 'మందాకిని' పాత్ర స్వభావంపై దర్శకుడు చిన్న హింట్ ఇచ్చినట్టైంది.

Recommended For You
Lenin 8 Days Box Office: అఖిల్ కెరీర్‌లోనే హయ్యెస్ట్‌ కలెక్షన్లు.. లెనిన్ మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
Lenin 8 Days Box Office: అఖిల్ కెరీర్‌లోనే హయ్యెస్ట్‌ కలెక్షన్లు.. లెనిన్ మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
SS Rajamouli Reveals Priyanka Chopra s Mandakini Look From Varanasi on Birthday

సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లో పాత్రల గురించి ముందుగానే వివరాలు వెల్లడించరు. కానీ, ఈసారి ప్రియాంక పాత్రకు సంబంధించిన క్యాప్షన్‌నే కథలో ఆమె ఎంత కీలకమో చెప్పేలా ఉంది. ఒకవైపు సున్నితత్వం, మరోవైపు అవసరమైతే అగ్నికణంలా మారే శక్తి ఉన్న పాత్ర అని, మందాకినిని తీర్చిదిద్దినట్లు అభిమానులు అంచనా వేస్తున్నారు. రాజమౌళి పోస్టుతో పాటు మహేష్ బాబు చేసిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. "మా ఒకే ఒక్క మందాకినికి హ్యాపీ బర్త్‌డే" అంటూ ప్రియాంకకు శుభాకాంక్షలు తెలిపాడు.

14 నెలలుగా షూటింగ్‌లో ప్రియాంక..
'వారణాసి' కోసం ప్రియాంక చోప్రా దాదాపు 14 నెలలుగా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు హాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమాకు ఆమె ఎక్కువ సమయం కేటాయించడం విశేషం. ఇటీవల ఒక సందర్భంలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా స్లో మోషన్ యాక్షన్ జంప్స్ చేసినట్లు కూడా ప్రియాంక వెల్లడించింది. దీంతో సినిమాలో ఆమె పాత్ర కేవలం పాటలకో, రొమాన్స్‌కో పరిమితం కాకుండా యాక్షన్, అడ్వెంచర్ అంశాల్లోనూ కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది.

You May Also Like
Dhurandhar: రణ్‌వీర్ సింగ్ డబుల్ ధమాకా.. ఓటీటీలోనూ 'ధురంధర్' రికార్డుల మోత
Dhurandhar: రణ్‌వీర్ సింగ్ డబుల్ ధమాకా.. ఓటీటీలోనూ 'ధురంధర్' రికార్డుల మోత

రెండు విభిన్న పాత్రల్లో మహేష్?
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర', 'శ్రీరాముడు' అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మూవీ మేకర్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాలాలను దాటి ప్రపంచవ్యాప్తంగా సాగే సాహస గాథగా ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మందాకిని పాత్ర కూడా కథను ముందుకు నడిపే కీలక పాత్రగా ఉండే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

Sreemukhi: శ్రీముఖికి పెళ్లి కళ.. అలాంటి వాళ్ల కోసమే ఇన్నాళ్లూ అంటూ
Sreemukhi: శ్రీముఖికి పెళ్లి కళ.. అలాంటి వాళ్ల కోసమే ఇన్నాళ్లూ అంటూ

'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి భారీ విజయాల తర్వాత రాజమౌళి తెరకెక్కించారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ వంటి స్టార్ నటీనటులు భాగం కావడంతో 'వారణాసి'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే రోజుల్లో విడుదలయ్యే తదుపరి అప్‌డేట్స్‌తో అంచనాలను మరింత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X