రెమ్యూనరేషన్ పెంచిన భాగ్య‌శ్రీ భోర్సే.. లెనిన్ హిట్ తర్వాత పారితోషికం ఎన్ని కోట్లంటే?

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే..కేవలం అందం, అభినయం మాత్రమే కాదు.. బాక్సాఫీస్ విజయం కూడా అవసరమే. కానీ, టాలీవుడ్‌లో వరుస పరాజయాలు ఎదుర్కొన్నప్పటికీ, తన టాలెంట్‌తో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించిన యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే.. తాజాగా ఈ అమ్మడు నటించిన 'లెనిన్' సినిమా ఆమె కెరీర్‌కు కీలక మలుపు తిప్పిందనే చెప్పాలి. దీంతో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా తర్వాత ఆమె మార్కెట్ విలువ పెరగడంతో పాటు, రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిందట.

Also Read
Dhurandhar: రణ్‌వీర్ సింగ్ డబుల్ ధమాకా.. ఓటీటీలోనూ 'ధురంధర్' రికార్డుల మోత
Dhurandhar: రణ్‌వీర్ సింగ్ డబుల్ ధమాకా.. ఓటీటీలోనూ 'ధురంధర్' రికార్డుల మోత

ఫ్లాప్స్ వచ్చినా తగ్గని క్రేజ్
హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమాతో పరిచయమైంది. ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం దక్కలేదు. అనంతరం వచ్చిన కింగ్‌డమ్, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా వంటి సినిమాలు కూడా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి. కానీ, భాగ్యశ్రీ విషయంలో అలా జరగలేదు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, నటన కారణంగా నిర్మాతలు, దర్శకులు బాక్సాఫీస్ ఫలితాలను పక్కన పెట్టి ఆమెకు అవకాశాలు ఇచ్చారు.

Recommended For You
100 కోట్లు ఆషామాషీ కాదు.. సమంతపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్
100 కోట్లు ఆషామాషీ కాదు.. సమంతపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్
Bhagyashri Borse Hikes Remuneration

'లెనిన్' టర్నింగ్ పాయింట్?
అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన 'లెనిన్' సినిమా కేవలం అఖిల్‌కే కాదు, భాగ్యశ్రీ కెరీర్‌కూ ఎంతో కీలకమైంది. ఈ సినిమాలో ఆమె 'భారతి' అనే పాత్రను పోషించింది. ఈ సినిమాకు ఫ్లస్ పాయింట్ గా మారింది. మొదటి భాగంలో అమాయక గ్రామీణ యువతిగా కనిపించిన భాగ్యశ్రీ, రెండో భాగంలో భావోద్వేగ సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పటివరకు గ్లామర్ హీరోయిన్‌గా మాత్రమే చూసిన ప్రేక్షకులు.. 'లెనిన్'లో ఆమె నటన చూసి మరో కోణాన్ని గుర్తించారు.

You May Also Like
అమీర్‌ ఖాన్‌ను చంపితే 5 కోట్ల బహుమానం.. మత గురువు సంచలన ప్రకటన
అమీర్‌ ఖాన్‌ను చంపితే 5 కోట్ల బహుమానం.. మత గురువు సంచలన ప్రకటన

ఇక లెనిన్ సినిమా హిట్ తర్వాత భాగ్యశ్రీ పరిస్థితి మారినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ. 1.5 కోట్లు తీసుకునేదట. కానీ, ఇప్పడు రూ.2. 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. భాగ్యశ్రీ విషయంలో మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే.. ఆమె కమర్షియల్ సినిమాలతో పాటు, ఎమోషనల్ పాత్రల్లోనూ నటించగలదనే అభిప్రాయం ఏర్పడింది. అందుకే మిడ్-రేంజ్, పెద్ద బ్యానర్ల నిర్మాతలు కూడా ఆమెపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

Sreemukhi: శ్రీముఖికి పెళ్లి కళ.. అలాంటి వాళ్ల కోసమే ఇన్నాళ్లూ అంటూ
Sreemukhi: శ్రీముఖికి పెళ్లి కళ.. అలాంటి వాళ్ల కోసమే ఇన్నాళ్లూ అంటూ

తెలుగు తర్వాత తమిళంపై ఫోకస్
ప్రస్తుతం భాగ్యశ్రీ తెలుగు సినిమాలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, ఇతర భాషల్లోనూ తన మార్కెట్‌ను విస్తరించే ప్రయత్నం చేస్తోందట. ముఖ్యంగా శివకార్తికేయన్ హీరోగా రూపొందుతున్న 'సేయోన్' సినిమాతో తమిళంలోకి అడుగుపెడుతోంది. ఆ సినిమా కూడా సక్సెస్ అయితే.. స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే.. 'లెనిన్' విజయం భాగ్యశ్రీ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింనే చెప్పాలి.

లెనిన్ హిట్‌తో అఖిల్ పుల్ జోష్.. అనిల్ రావిపూడికి స్టేజ్‌పైనే బంపర్ ఆఫర్!
లెనిన్ హిట్‌తో అఖిల్ పుల్ జోష్.. అనిల్ రావిపూడికి స్టేజ్‌పైనే బంపర్ ఆఫర్!

లెనిన్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా రూ.53.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇందులో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.43.94 కోట్ల గ్రాస్, రూ.38.30 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది. ఇక ఓవర్సీస్‌ల్లో రూ. 9.56 కోట్ల గ్రాస్ వసూలు అందుకుంది. ఇక మూవీ మేకర్స్ లెక్కల ప్రకారం, ఈ సినిమా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 67.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X