Dhurandhar: రణ్‌వీర్ సింగ్ డబుల్ ధమాకా.. ఓటీటీలోనూ 'ధురంధర్' రికార్డుల మోత

రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్'. ఈ సినిమా థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద నయా రికార్డులను నెలకొల్పింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1,400 కోట్లు వసూలు చేసింది. ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కూడా అదే జోరును కొనసాగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త రికార్డు నెలకొల్పింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన 2026 ఫస్ట్ 6 నెలల వ్యూయర్‌షిప్ స్టాటిస్టిక్స్‌లో 'ధురంధర్' మరో రికార్డు నెలకొల్పింది. అదే సమయంలో ఇంగ్లీషేతర సినిమాగా నిలిచింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటీ?

Also Read
అఖిల్‌‌తో ముద్దు కావాలన్న సీరియల్ నటి.. అక్కినేని హీరో రిప్లయ్ అలా!
అఖిల్‌‌తో ముద్దు కావాలన్న సీరియల్ నటి.. అక్కినేని హీరో రిప్లయ్ అలా!

నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన వ్యూయర్‌షిప్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. 2026 జనవరి నుంచి జూన్ వరకు ప్రపంచవ్యాప్తంగా 'ధురంధర్'ను 3 కోట్ల 70 లక్షల మంది (37 మిలియన్ వ్యూస్) చూశారు. దీంతో ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక ఆదరణ అందుకున్న ఇంగ్లీషేతర సినిమాగా ఈ మూవీ రికార్డు సృష్టించింది. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన నాన్-ఇంగ్లిష్ సినిమాల్లోనూ ఈ స్రై మూవీ టాప్ ఫ్లేస్ లో నిలిచింది. 2026 తొలి ఆరు నెలల కాలంలో ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌కు ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా వీక్షణలు నమోదయ్యాయని తెలిపింది.

Ranveer Singh s Dhurandhar Creates Netflix Record With 37 Million Views
Recommended For You
100 కోట్లు ఆషామాషీ కాదు.. సమంతపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్
100 కోట్లు ఆషామాషీ కాదు.. సమంతపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్

'ధురంధర్' సినిమా ఇండియన్ గూఢచారి నేపథ్యంతో సాగుతుంది. ఉగ్రవాద సంస్థల్లో చొరబడి దేశ భద్రత కోసం ప్రాణాలకు తెగించి పోరాడే గూఢచారి పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాలో ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్, ఎమోషన్స్, దేశభక్తి వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా భారీ రెస్పాన్ అందుకుంది.

You May Also Like
అమీర్‌ ఖాన్‌ను చంపితే 5 కోట్ల బహుమానం.. మత గురువు సంచలన ప్రకటన
అమీర్‌ ఖాన్‌ను చంపితే 5 కోట్ల బహుమానం.. మత గురువు సంచలన ప్రకటన

వెబ్‌సిరీస్‌ల విభాగంలో 'హిస్ అండ్ హర్స్' సిరీస్‌కు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ సిరీస్‌ ఏకంగా 104 మిలియన్ వ్యూస్ అందుకుంది. 'బ్రిడ్జర్టన్ సీజన్ 4' - 100 మిలియన్, 'ఐ విల్ ఫైండ్ యూ'- 64 మిలియన్, 'స్ట్రేంజర్ థింగ్స్'- 56 మిలియన్, 'రన్ అవే'- 50 మిలియన్‌తో తర్వాతి స్థానంలో నిలిచాయి. ఈ నివేదికను రూపొందించేటప్పుడు కేవలం ప్రేక్షకులు చూసిన గంటలను మాత్రమే కాకుండా, ఒక్కో సినిమాను లేదా సిరీస్‌ను ఎంతమంది వీక్షించారనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.

Sreemukhi: శ్రీముఖికి పెళ్లి కళ.. అలాంటి వాళ్ల కోసమే ఇన్నాళ్లూ అంటూ
Sreemukhi: శ్రీముఖికి పెళ్లి కళ.. అలాంటి వాళ్ల కోసమే ఇన్నాళ్లూ అంటూ

2026 జనవరి నుంచి జూన్ వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు 97 బిలియన్ గంటలకు పైగా కంటెంట్‌ను వీక్షించినట్లు సంస్థ తెలిపింది. ఒకే ఆరు నెలల వ్యవధిలో నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో హైయెస్ట్ వ్యూస్ అందుకున్నట్లు పేర్కొంది. ఈ లెక్కలు ఇండియన్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు అంతర్జాతీయ స్థాయిలో రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X