తమన్నా భాటియా గ్లామర్ ట్రీట్... వల లాంటి డ్రెస్‌లో కుర్రాళ్లని అలా ట్రాప్!

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో 20 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకుని, నేటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ముద్దుగుమ్మల్లో తమన్నా భాటియా కూడా ఒకరు. వరుస సినిమాలు, ఐటెం సాంగ్స్‌తో తన హవా సాగిస్తున్నారు మిల్కీబ్యూటీ. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ వరుస అవకాశాలు అందుకుంటూ తన మార్కెట్, క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు. సినిమాలతో పాటు సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గానూ తన మార్క్ చూపించారు తమన్నా భాటియా.

Also Read
Rao Bahadur Day 9 Collections: పడిపోయిన రావు బహదూర్ కలెక్షన్స్.. సత్యదేవ్ మూవీ లాభాల్లోకి రావాలంటే?
Rao Bahadur Day 9 Collections: పడిపోయిన రావు బహదూర్ కలెక్షన్స్.. సత్యదేవ్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

సింధీ కుటుంబానికి చెందిన తమన్నా.. 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. దాని కారణంగా చదువుకు, కాలేజీకి దూరం కావాల్సి వచ్చిందని ఆమె పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా కాలేజీకి వెళ్లినప్పుడు ఇదే విషయాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అయినప్పటికీ జీవితంలో ఎన్నో విజయాలు సాధించి దేశంలోని టాప్ సెలబ్రిటీలలో ఒకరిగా దూసుకెళ్తున్నారు. 20 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ భాషలలో 89 చిత్రాలను పూర్తి చేశారు. అతి త్వరలోనే 100 సినిమాల మార్క్‌ను చేరుకోనున్నారు.

Tamannaah Bhatia s Bold New Photoshoot Goes Viral Actress Turns Heads in Stunning Designer Outfit

ప్రస్తుతం హిందీలో ది వాన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్, రోహిత్ శెట్టి, జగన్ శక్తి దర్శకత్వంలో మరో రెండు సినిమాలతో రాగిణి ఎంఎంస్ 3, వీ శాంతారాం బయోపిక్.. తమిళంలో పురుషున్ సినిమాలలో తమన్నా భాటియా నటిస్తున్నారు. దక్షిణాదికి దూరంగా పూర్తిగా హిందీ పరిశ్రమపైనే ఈ ముద్దుగుమ్మ ఫోకస్ పెట్టారు. నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడిన మిల్కీబ్యూటీ ఆయనతో రెండేళ్లకు పైగా ప్రేమాయణం సాగించారు. త్వరలో పెళ్లి చేసుకుని గుడ్‌న్యూస్ చెబుతారని అనుకుంటే అనూహ్యంగా బ్రేకప్ చెప్పి షాకిచ్చింది ఈ జంట. వీరిద్దరూ విడిపోవడానికి కారణాలపై మీడియాలో రకరకాల కారణాలు, వాదనలు నేటికీ చక్కర్లు కొడుతున్నాయి. అయితే కెరీర్‌లో స్థిరపడాలని విజయ్ వర్మ.. పెళ్లి చేసుకోవాలని తమన్నాల మధ్య మనస్పర్ధలు రావడంతోనే ఈ బ్రేకప్ జరిగినట్లుగా బీటౌన్‌లో గాసిప్స్ వస్తున్నాయి.

Recommended For You
Lenin Day 2 Collections:లెనిన్ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. అఖిల్ సినిమాకు ఎన్ని కోట్లంటే?
Lenin Day 2 Collections:లెనిన్ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. అఖిల్ సినిమాకు ఎన్ని కోట్లంటే?

ఒకప్పుడు ఇంటిమేట్ సీన్స్, లిప్‌లాక్ సీన్లకు దూరంగా ఉన్న తమన్నా భాటియా.. ప్రస్తుతం నో కిస్ నిబంధనలను పక్కన పెట్టినట్లుగా క్లారిటీ ఇచ్చారు. తీరిక వేళల్లో ఏదైనా ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి ధ్యానం చేసుకోవడం, దేవాలయాలను దర్శించుకోవడం తమన్నాకు అలవాటు. ఇటీవల ఉజ్జయిని, వారణాసి క్షేత్రాలను దర్శించిన ఆమె తన ఇంట్లోనే లింగ భైరవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనకు కాశీలో చెప్పలేనంత ప్రశాంతంగా ఉంటుందని, తాను ఎక్కడికి వెళ్లినా కుటుంబంతోనే వెళ్తానని తమన్నా చెప్పారు.

You May Also Like
'నేనంటే ఇష్టమని నడిరోడ్డుపై.. ఆ సైకో నుంచి అలా తప్పించుకున్నా’
'నేనంటే ఇష్టమని నడిరోడ్డుపై.. ఆ సైకో నుంచి అలా తప్పించుకున్నా’

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే తమన్నా భాటియా.. తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే హాట్ హాట్ ఫోటోషూట్స్‌తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటుంది తమన్నా. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చిన్న రంధ్రాలు ఉన్న వల లాంటి డ్రెస్‌లో మెడలో ముత్యాల హారాలు, కస్టమైజ్డ్ ఇయర్ రింగ్స్, ఉంగరాలు, బ్యాంగిల్స్ ధరించి తమన్నా ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. వీటికి మిల్కీబ్యూటీ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: tamannaah bhatia movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X