X
తెలుగు » సినిమాలు » 24 » స్టోరీ
24
Sci - Fi | 06 May 2016 | U |
Telugu

24 స్టోరీ

'24' సినిమా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు సూర్య శివకుమార్, సమంత, నిత్య మీనన్, గిగీష్ కర్నాడ్, అజై, సరణ్య పొన్వన్నన్, సత్యన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం 'మనం' ఫేం విక్రమ్ కుమార్ నిర్వహించారు మరియు గ్లోబల్ సినిమాస్, 2డీ ఎంటర్టైంట్, శ్రేష్ట మూవీస్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చరు.

కథ

సైంటిస్టు శివకుమార్‌ (సూర్య) కష్టపడి.. కాలాన్ని నియంత్రణ చేయగల వాచీని కనిపెడతాడు. ఇలాంటి అన్ని కథల్లోలాగానే దాన్ని సొంతం చేసుకుని ప్రపంచాన్ని తన కాళ్ల దగ్గర కు తెచ్చుకోవాలని ఎంతకైనా తెగించే ఓ విలన్ కన్ను దాని పై పడుతుంది . ఆ విలన్ మరెవరో కాదు..ఈ సైంటిస్టు అన్నయ్యే ఆత్రేయ (సూర్య) . ఆ విలన్ ...తన తమ్ముడని కూడా చూడకుండా శివకుమార్ ని అతని భార్య ప్రియ(నిత్యామీనన్) ని చంపేసి దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. మరి సైంటిస్టు శివకుమార్ తెలివి తక్కువవాడా....ఆ వాచీ ఎట్టి పరిస్దితుల్లో విలన్ కు దక్కకూడదని, పసిగుడ్డు అయిన తన కొడుకు మణిశంకర్(సూర్య) ఒడిలో పెట్టి వేరేవారికి అప్పచెప్తాడు. 24 సంవత్సరాలు గడిచి, పెద్దయ్యాక మణి శంకర్‌కు ఈ వాచీవిషయం ఎలా తెలిసింది. తన తల్లిని, తండ్రిని చంపిన ఆత్రేయపై పగ తీర్చుకున్నాడా...ఏం చేసాడు అనేది మిగతా కథ. అలాగే ఈ కథలో సత్య (సమంత) తో లవ్ స్టోరీ ఎలా కలిపారనేది తెలుసుకోవాలన్నా సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+