twitter

    7 డేస్ 6 నైట్స్ స్టోరి

    7 డేస్ 6 నైట్స్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్, రోహన్, కృతిక శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎంఎస్‌ రాజు వహించారు. సుమంత్ అశ్విన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్‌ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, లైన్‌ ప్రొడ్యూసర్‌: జె. శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్‌: మంతెన రాము. 

    కథ

    ఆనంద్ (సుమంత్ అశ్విన్) సినిమా డైరెక్టర్ కావాలనే ఔత్సాహిక యువకుడు. యాక్టర్ కావాలనుకొనే కుమార మంగళం అలియాస్ మంగళం (రోహన్) ఇద్దరు ప్రాణ స్నేహితులు. రోహన్‌కు వారం రోజుల్లో పెళ్లి అనగా బ్యాచలర్ పార్టీ కోసం ఇద్దరు గోవాకు వెళ్తారు. వారం రోజుల్లో పెళ్లి అవ్వాల్సిన రోహన్ గోవాలో అమియా (కృతికా శెట్టి) అనే యువతితో ప్రేమలో పడుతాడు. అయితే అక్కడ ఎదురైన పరిస్థితుల కారణంగా ఆనంద్ సూసైడ్ చేసుకొనేంతగా ఆలోచనల్లో పడుతాడు. నిర్మాతకు కథ చెప్పిన ఆనంద్‌ డైరెక్టర్‌గా మారాడా? రోహన్, ఆనంద్ మధ్య స్నేహం ప్రాణం కంటే మిన్నగా ఎందుకు మారింది? ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లికి ముందు రోహన్ మరో అమ్మాయి ఆకర్షణకు గురయ్యాడు? ఆనంద్‌కు విన్నీ ఎందుకు దూరమైంది. ప్రేమ విఫలమైన ఆనంద్ గోవాలో పరిచయమైన రితిక (మెహర్ చాహల్)‌తో పరిచయం ఎంత వరకు వెళ్లింది? చివరకు రోహన్ పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకొన్నాడా? గోవాలో పరిచయమైన అమియాతో రోహన్ రిలేషన్‌ ఎక్కడ వరకు వెళ్లింది? అనే ప్రశ్నలకు సమాధానమే 7 days 6 nights కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie 7 డేస్ 6 నైట్స్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X