సెవెంత్ సెన్స్ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శృతిహాసన్, సూర్య, అభినయ, జానీ, అవినాస్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.మురగదాస్ నిర్వహించారు మరియు నిర్మాత ఉదయగిరి స్టాలిన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హ్యారీస్ జైరాజ్ స్వరాలు సమకుర్చారు.
కథ
ఆరవ శతాబ్దానికి చెందిన పల్లవరాజు భోధి దమ్మ(సూర్య) మార్షిల్ ఆర్ట్స్ ని,చరకసంహిత(వైధ్య శాస్తం)ని ఔపోసన పట్టిన అధ్బుత వ్యక్తి. పరోపకార పరాయణుడు అయిన ఆయన తన గురువు ఆజ్ఞ మేరకు చైనా వెళ్లి అక్కడ విచిత్రమైన రోగంతో అట్టుడుకుపోతున్న ఓ గ్రామాన్ని తన వైద్యంతో బ్రతికిస్తాడు.అంతేగాక ఆ ఊరి జనాల్ని ఇబ్బంది పెడుతున్న దుష్టుల నుంచి రక్షించి,అక్కడున్న వారికి తన మార్షిల్ ఆర్ట్స్ విద్యను నేర్పి,అక్కడ షావోలిన్ గుడిని నిర్మించి కాలం చేస్తాడు. ప్రస్తుత కాలానికి వస్తే ఇప్పుడు చైనా బయో వార్ తో ఇండియాని తన చేతుల్లో పెట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది.ఆ క్రమంలో ఆరవ శతాబ్దంలో వచ్చిన వైరస్ ని మళ్లీ నిద్రలేపి ఇండియాని రోగాలు పాలు చేయాలని నిర్ణయించుకుంటుంది.అందుకు డోంగ్ లీ (జానీ ట్రై)అనే మార్షిల్ ఆర్ట్స్ నిపుణుడ్ని ఇండియాకు పంపుతుంది. ఈ పరిస్ధితుల్లో మళ్లీ భోధి దమ్మ అవసరం ఇండియాకు వస్తుంది. ఆయన బ్రతికి వస్తేనే ఆ రోగాన్ని కుదర్చగలరు. ఆ భోధి దమ్మ వంశానికి చెందిన వాడే అరవింద(సూర్య). ఆ విషయాన్ని భోధిధమ్మ డిఎన్ ఎ పై పరిశోధన చేస్తున్న సైంటిస్టు శుభ(శృతిహాసన్) తెలుసుకుంటుంది. అప్పుడు ఆమె ఏం చేసింది. భోధిదమ్మని మళ్లీ ఈ కాలానికి తీసుకువచ్చారా.. ఎలా దేశాన్ని రక్షించారు అనేది మిగతా కథ.