X
Home టాప్ లిస్టింగ్

టాప్ 5 రీ రిలీజ్ మూవీస్ ఫస్ట్ డే టాప్ కలెక్షన్స్

Author Administrator | Updated: Thursday, June 1, 2023, 01:08 PM [IST]

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో రీసెంట్ టైంలో రీ రిలీజ్ ల ట్రెండ్ జరుగుతున్న విషయం తెలిసిందే. లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ లో ఒకటి తర్వాత ఒకటి వరుస పెట్టి సినిమాలు రీ రిలీజ్ లు అవుతున్నయి. మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏ సినిమా కైనా సరే ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. కొంతమంది నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు మంచి బజ్ ఉన్న సినిమాలను స్టార్స్ బర్త్ డే కానుకగా అభిమానుల డిమాండ్ మేరకు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరికి సినిమాలు మరోసారి థియేటర్లో సందడి చేశాయి. అయితే ఇప్పటి వరకు వచ్చిన రీ రిలీజ్ సినిమాలలో ఏ సినిమా అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. ఇక టాప్ 5 లిస్టులో ఏ సినిమాలు ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..


cover image
ఖుషి 2001
1

ఇక నెంబర్ వన్ స్థానంలో అయితే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా కొనసాగుతోంది. రీ రిలీజ్ ట్రెండ్ లో ఈ సినిమా కూడా మరోసారి ఒక ట్రెండ్ సెట్ చేసింది. అప్పట్లోనే అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకొని ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఖుషి సినిమా ఇటీవల 4కె వెర్షన్లో మళ్లీ 5.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఈ సినిమాను రికార్డును బ్రేక్ చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. మరి రాబోయే రోజుల్లో ఏ సినిమా ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి.

సింహాద్రి
2

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి. ఈ చిత్రాన్ని మేకర్స్ చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయడం జరిగింది. 150కి పైగా థియేటర్స్ లో, మొత్తం 1210 షోలు ప్రదర్శించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఫస్ట్ డే ఈ సినిమా కి సెన్సేషన్ వసూళ్లు వచ్చాయి.  రూ.5.2 కోట్లు వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది 

 

జల్సా
3

జల్సా సినిమా 4K వెర్షన్ అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో ఒకటిగా కొనసాగుతోంది. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మొదటి సినిమా అప్పట్లోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆ మధ్య విడుదల చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తంగా 3.20 కోట్ల రేంజ్ లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం విశేషం

ఆరెంజ్
4

ఆరెంజ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా కంటెంట్ కు ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆరెంజ్ సినిమాను రి రిలీజ్ చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తంగా 3.12 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది

ఒక్కడు
5

మహేష్ బాబు ఆల్ టైమ్ బెస్ట్ సినిమాలో ఒకటైన ఒక్కడు సినిమా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రీ రిలీజ్ ట్రెండ్ లో 2.14 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ సినిమాతోనే మహేష్ బాబు మాస్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అతను తన మార్కెట్ స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+