90 ఎంఎల్ సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్, రావు రమేష్, ఆలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, ప్రగతి, ప్రవీణ్, ‘కాలకేయ’ ప్రభాకర్, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రోల్ రిడా, నెల్లూరు సుదర్శన్, దువ్వాసి మోహన్ తదితరులు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శేఖర్ రెడ్డి వహించారు మరియు నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. సంగీతం : అనూప్ రూబెన్స్, లిరిక్స్ : చంద్రబోస్, కెమెరా : జె.యువరాజ్, ఎడిటింగ్ : ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్ : వెంకట్.
కథ
పుట్టుకతోనే ఓ అరుదైన వ్యాధికి గురవుతాడు దేవదాస్ (కార్తికేయ). అతని మూడు పూటల మూడు పెగ్గు (90 ml)ల మందే అతనికి మెడిసిన్ అంటూ డాక్లర్లు తేల్చి చెబుతారు. అలాంటి దేవదాస్‌కు సువాసన (నేహా సోలంకి) పరిచయమవుతుంది. సువాసన ఫ్యామిలీకి మందు వాసన అంటే నచ్చదు. అలాంటి కుటుంబానికి చెందిన సువాసన.. ఒక్క పూట మందు లేకపోతే చనిపోయే దేవదాస్ మధ్య జరిగే కథే 90 ML.దేవదాస్ తనకు ఉన్న జబ్బు గురించి సువాసనకు తెలుస్తుందా? ఆ నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టడంతో ఎలాంటి పరిణామాలు జరిగాయి? ఈ కథలో జాన్‌విక్ (రవి కిషన్)కు ఉన్న సంబంధం ఏంటి? తన కూతురు సువాసనను క్షున్నాకర్ (రావు రమేష్) జాన్‌విక్‌కు ఇచ్చి చేసేందుకు ఎందుకు ఒప్పుకున్నాడు. సువాసన కోసం ఒక్క రోజు మందు తాగకుండా ఉండే కండీషన్‌కు ఒప్పుకున్న దేవదాస్‌కు ఏమైంది? అనే అంశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి.