X
ఆడవాళ్లు మీకు జోహార్లు
Romance | 04 Mar 2022 | U | 141 Mins
Telugu

ఆడవాళ్లు మీకు జోహార్లు స్టోరీ

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  శర్వానంద్, రష్మిక, రాధిక శరత్ కుమార్, ఖుష్బూ, ఊర్వశి, ఝాన్సీ, కళ్యాణి నటరాజన్, సత్య కృష్ణ, బెనర్జీ, సత్య అక్కల తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కిషోర్ తిరుమల వహించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 

కథ
పెద్దమ్మ (ఊర్వశి) , లక్ష్మమ్మ (రాధిక శరత్ కుమార్) పెద్దదిక్కుగా ఉండే భారీ ఉమ్మడి కుటుంబంలో ఏకైక వారసుడు చిరంజీవి (శర్వానంద్). చిరు అంటే ఇంటిల్లిపాదికి కొండంత ప్రేమ. అందరూ ఇష్టపడే చిరంజీవికి అందరికి నచ్చే అమ్మాయిని వెతికి పెళ్లి చేయాలనేది ఇంటి సభ్యులు కోరిక. పది మందికి నచ్చే అమ్మాయి లభించకపోవడంతో చిరంజీవి పెళ్లి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ క్రమంలో విలువలు, మహిళా పక్షపాతి, పారిశ్రామిక వేత్త వకులాదేవీ (కుష్పూ) కూతురు ఆద్య (రష్మిక మందన్న)తో చిరు ప్రేమలో పడుతాడు. ముక్కుసూటి మనిషి వకులా దేవీ జీవనశైలి, వ్యక్తిత్వం కారణంగా చిరంజీవి ప్రేమకు ఎలాంటి సమస్యలు ఏర్పడ్డాయి? వకులా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి చిరంజీవి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు. తమ వారసుడు చిరంజీవికి భార్యగా తీసుకురావడానికి ఇంటి పెద్దలు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? చిరంజీవి పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలు ఏమిటి? తల్లి మాట జవదాటలేని ఆద్యను చిరంజీవి ఎలా మెప్పించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+