ఆటగాళ్ళు సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్, జగపతి బాబు, దర్శన బానిక్, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పరుచూరి మురళి వహించారు మరియు నిర్మాత వాసిరెడ్డి రవింద్ర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించారు
కథ
సిద్ధార్థ్ (నారా రోహిత్) టాలీవుడ్లో అపజయం ఎరుగని టాప్ ఫిల్మ్ డైరెక్టర్. అంజలి(దర్శన బానిక్) అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుంటాడు. అంతా సవ్యంగా సాగుతున్న వీరి కాపురంలో అనుకోని సంఘటన.... తమ ఇంట్లోనే అంజలి హత్య చేయబడుతుంది. సిద్ధార్థ్ మీద అనుమానంతో పోలీసులు అతడిని అరెస్టు చేస్తారు. సిద్ధార్థ్ లాయర్‌ను పెట్టుకోకపోవడంతో ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రముఖ క్రిమినల్ లాయర్ వీరేంద్ర(జగపతి బాబు) టేకప్ చేస్తాడు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం అక్కడ దొరికిన ఎవిడెన్స్ ఆధారంగా హంతకుడు సిద్దార్థ్... కాదని, గతంలో అంజలిని ప్రేమించాలని వెంటపడ్డ మున్నా ఈ దారుణానికి ఒడిగట్టాడని తేల్చేసి... అతడికి ఉరిశిక్ష పడేలా చేసి కేసు ఫినిష్ చేస్తాడు.
తనను కేసులో గెలిపించిన వీరేంద్రకు సిద్ధార్థ్ కోట్లు విలువచేసే ఖరీదైన కారును గిఫ్టుగా పంపిస్తాడు. తనకు ఇలాంటివి తీసుకోవడం ఇష్టం ఉండదని, న్యాయం ఎటు వైపు ఉంటే అటు తాను వైపే ఉంటానని చెప్పి ఆ బహుమతిని తిరిగి ఇచ్చేస్తాడు. తిరిగి వెళుతున్న సమయంలో వీరేంద్రకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఈ హత్య చేసింది మున్నా కాదని, సిద్ధార్థ్ ఈ కేసు నుండి బయట పడటానికి తనను పావులా వాడుకున్నాడని తెలుసుకున్న తర్వాత సినిమాలో అసలు ఆట మొదలవుతుంది.
అసలు సిద్ధార్థ్ తన భార్యను చంపడానికి కారణం ఏమిటి? న్యాయాన్ని గెలిపించడానికి సీఎంను సైతం ఎదిరించే వీరేంద్ర... ఒక ఫిల్మ్ డైరెక్టర్ ఉచ్చులో ఎలా పడ్డాడు? ఒక లాయర్‌కు, హంతకుడికి మధ్య జరిగిన ఆటలో చివరికి ఎవరె పైచేయి సాధించారు అనేది మిగతా కథ.