ఎబిసిడి (2019)(U)
Release date
17 May 2019
genre
ఎబిసిడి స్టోరి
ఎబిసిడి సినిమా కామెడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు శిరీష్, రుక్సార్, నాగేంద్ర బాబు, సుభలేఖ సుధాకర్, వెన్నెల కిశోర్, కోట శ్రీనివాస రావు, రాజా చెంబోలు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సంజీవ్ రెడ్డి వహించారు మరియు నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మరియు యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జుధ సంధ్య్ స్వరాలు సమకూర్చరు.
కథ
అమెరికా పౌరుడైన అభి (అల్లు శిరీష్)కు జీవితంలో విలాసాలు తప్ప మరోకటి తెలియవు. జీవితంలో లక్ష్యం, బాధ్యతలు తెలుసుకోకుండా తిరిగే అభిని దారిలో పెట్టాలని తండ్రి (నాగబాబు) అతడిని ఇండియాకు పంపిస్తాడు. డబ్బును దుబారాగా ఖర్చు చేసే అభికి పైసలు ఇవ్వకుండా బతకమని సూచిస్తాడు. ఆ క్రమంలో నేహా (రుక్షర్)తో ప్రేమలో పడుతాడు? జీవితం ఏంటో తెలుసుకొనే పరిస్థితుల్లో తాను నివసించే మురికివాడకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించడానికి యువ రాజకీయ నేతను ఎదురించాల్సి వస్తుంది. జీవితంలో బాధ్యతలు తెలుసుకోవడానికి తండ్రి పెట్టిన పరీక్షలో అభి విజయం సాధించాడా? నేహాను ఇష్టపడిన క్రమంలో ఆమెకు తన ప్రపోజల్‌ను ఎలా చెప్పాడు? నేహా ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశాడు? తాను నివసించే మురికివాడకు ఎదురైన సమస్య ఏంటి? అభి యూత్ ఐకాన్ అవార్డును గెలుచుకోవడానికి ఎలాంటి ప్రతికూలతను అధిగమించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఏబీసీడీ మూవీ కథ.
**Note:Hey! Would you like to share the story of the movie ఎబిసిడి with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు