X
తెలుగు » సినిమాలు » ఎబిసిడి
ఎబిసిడి

ఎబిసిడి

Comedy | 17 May 2019 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఎబిసిడి స్టోరీ

ఎబిసిడి సినిమా కామెడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు శిరీష్, రుక్సార్, నాగేంద్ర బాబు, సుభలేఖ సుధాకర్, వెన్నెల కిశోర్, కోట శ్రీనివాస రావు, రాజా చెంబోలు   తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సంజీవ్ రెడ్డి వహించారు మరియు నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మరియు యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జుధ సంధ్య్ స్వరాలు సమకూర్చరు. కథ అమెరికా పౌరుడైన అభి (అల్లు శిరీష్)కు జీవితంలో విలాసాలు తప్ప మరోకటి తెలియవు. జీవితంలో లక్ష్యం, బాధ్యతలు తెలుసుకోకుండా తిరిగే అభిని దారిలో పెట్టాలని తండ్రి (నాగబాబు) అతడిని ఇండియాకు పంపిస్తాడు. డబ్బును దుబారాగా ఖర్చు చేసే అభికి పైసలు ఇవ్వకుండా బతకమని సూచిస్తాడు. ఆ క్రమంలో నేహా (రుక్షర్)‌తో ప్రేమలో పడుతాడు? జీవితం ఏంటో తెలుసుకొనే పరిస్థితుల్లో తాను నివసించే మురికివాడకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించడానికి యువ రాజకీయ నేతను ఎదురించాల్సి వస్తుంది. జీవితంలో బాధ్యతలు తెలుసుకోవడానికి తండ్రి పెట్టిన పరీక్షలో అభి విజయం సాధించాడా? నేహాను ఇష్టపడిన క్రమంలో ఆమెకు తన ప్రపోజల్‌ను ఎలా చెప్పాడు? నేహా ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశాడు? తాను నివసించే మురికివాడకు ఎదురైన సమస్య ఏంటి? అభి యూత్ ఐకాన్ అవార్డును గెలుచుకోవడానికి ఎలాంటి ప్రతికూలతను అధిగమించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఏబీసీడీ మూవీ కథ.
Read More

ఎబిసిడి కాస్ట్ & క్రూ

ఎబిసిడి సిబ్బంది సమాచారం

దర్శకత్వం సంజీవ్ రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జుధ సంధ్య్
నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఎబిసిడి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఏబీసీడీ చిత్రంలో అల్లరిగా తిరిగే ఓ యువకుడు బరువు బాధ్యతలను తెలుసుకోవడమనే కీలక పాయింట్. సరైన రీతిలో ప్రజెంట్ చేయడంలో తడబాటు కనిపిస్తుంది. యూత్‌కు నచ్చే అంశాలు సినిమాకు కొంత సానుకూలతగా మారింది. ఓ ఎన్నారై స్వదేశానికి వచ్చి జన్మభూమి విలువను, సాంప్రదాయాలను తెలుసుకునే కథాంశాలు తెర మీద ఇప్పటికే బోలెడు కనిపిస్తాయి. ఏబీసీడీ చిత్రంలో కొత్తదనం ఏమీ కనిపించదు. యూత్‌కు, బీ, సీ సెంటర్లలో కనెక్ట్ అయ్యే దానిని బట్టి సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

ఎబిసిడి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఎబిసిడి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+