అడ్డా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుశాంత్, శాన్వి, దెవ్ గిల్లి, కొటా శ్రీనివాస్ రావు, రఘు బాబు, తాగు బోతు రమేష్, వేణు మాదవ్, తనికెళ్ల భరణి, నాగినీడు దన్ రాజు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకుడు సాయి రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాతలు చింతలపూడి శ్రీనివాస రావు, నాగ సుశీల కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూఫ్ రుబెన్స్ స్వరాలు సమకుర్చరు.
కథ
ప్రేమించుకుని రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోవడానికి వచ్చే లవర్స్‌ను విడగొట్టడంలో అభి(సుశాంత్) స్పెషలిస్ట్. పిల్లల ప్రేమ వ్యవహారాలతో మనో వేదన పడే తల్లిదండ్రుల కోసం ఈ పనులు చేస్తుంటాడు అభి. అందుకోసం కొంత ఫీజు తీసుకుంటాడు. అభి విషయం తెలుసుకున్న ప్రియ(శాన్వి) తన అక్క ప్రేమ వ్యవహారాన్ని చెడగొట్టేందుకు అతని సహాయం తీసుకుంటుంది. ఈ క్రమంలో అభి ప్రియపై మనసు పారేసుకుంటాడు. ఓ సంఘటన వల్ల అభిని ప్రియ ద్వేషిస్తుంది. మరి ఆ కారణం ఏమిటి? కథ చివరకు ఎలా మలుపు తిరిగింది? అనేది తర్వాతి కథ!