X
Home టాప్ లిస్టింగ్

రామ్ చరణ్‌ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ మీరు చూశారా? ఎక్కడ చూడాలంటే..!

Author Administrator | Updated: Monday, March 27, 2023, 07:50 AM [IST]

చరణ్‌ ఇటీవల అమెరికా వెళ్లారు. అక్కడ అంతర్జాతీయ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఇందులో భాగంగా తన ఆల్ టైమ్ ఫేవరేట్ సినిమాల గురించి చెప్పాడు. తెలుగు భాషలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఏయే సినిమాలో ఇష్టమో చెప్పుకొచ్చాడు. చరణ్‌ ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీస్ ఏంటంటే.


cover image
1

ది నోట్ బుక్ సినిమా  రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ర్యాన్ గోస్లింగ్, రాచెల్ ఆడమ్స్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో చూడొచ్చు. రామ్ చరణ్ ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీస్ ది నోట్ బుక్ ఒక్కటి. 

 

2

రామ్ చరణ్ ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీస్ ఎక్కువ సార్లు చుసిన మూవీ వాటిలో టెర్మినేటర్ 2. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. టెర్మినేటర్ 2 సినిమా  సైన్స్ ఫిక్షన్, యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ సినిమాని జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించారు. ఆర్నాల్డ్, లిండా, రాబర్ట్ , ఎడ్వర్డ్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. 

3

గ్లాడియేటర్ రామ్ చరణ్ ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీస్ లో ఇదొక్కటి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. గ్లాడియేటర్ సినిమా  హిస్టారికల్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఈ సినిమాని రిడ్లే  దర్శకత్వం వహించారు. రస్సెల్ క్రౌన్, జాక్విన్, రాల్ఫ్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. 

4

ది ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్ రామ్ చరణ్ ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్ వార్ మూవీ క్యూటిన్ దర్శకత్వం వహించారు. బ్రాడ్ పిట్, క్రిస్టోఫ్, మైఖేల్, ఎలి రోత్ ప్రధాన పాత్రలలో నటించారు.

దాన వీర శూర కర్ణ 1977
5

తెలుగు లో రామ్ చరణ్ ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ ఫస్ట్ చెప్పిన పేరు దాన వీర శూర కర్ణ. ఈ చిత్రం 1977లో ఎన్టీఆర్ స్వీయ నిర్మాణంలో అలాగే స్వీయ దర్శకత్వంలో విడుదల అయింది. పౌరాణిక చిత్రంలో ఇది ఒక అత్యుత్తమైన చిత్రమని చెప్పుకోవచ్చు. ఈ సినిమాను చూడాలంటే యూట్యూబ్ లో అందుబాటులో వుంది. 

6

శేఖర్‌ కపూర్‌ దర్శకత్వం లో వచ్చిన మూవీ మిస్టర్ ఇండియా. బాలీవుడ్ లో  రామ్ చరణ్ ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ ఇది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాని బోనీ కపూర్, సురిందర్ కపూర్ నిర్మించారు. అనిల్ కపూర్, శ్రీదేవి తదితరులు నటించారు.

రంగస్థలం
7

రామ్ చరణ్ ఆల్ టైమ్ ఫేవరేట్ సినిమాల్లో తన సినిమా కూడా వుంది అదే కెరీర్ బెస్ట్ మూవీ రంగస్థలం. సుకుమార్ దర్శకత్వం లో  రామ్ చరణ్ నటనకు మంచి గురింపు వచ్చిన మూవీ. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. 

బాహుబలి
8

రాజమౌళి దర్శకత్వం లో బాహుబలి గురించి ప్రతేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమాను రేంజ్ ను పెంచి సరి హద్దులు దాటి తీసుకెళ్లిన సినిమా. రామ్ చరణ్ ఆల్ టైమ్ ఫేవరేట్ సినిమాల లిస్ట్ లో బాహుబలి కూడా వుంది. బాహుబలి 1, 2 నెట్‌ఫ్లిక్స్  లో చూడొచ్చు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+