X
Home టాప్ లిస్టింగ్

ప‌ర భాషా ద‌ర్శ‌కుల‌తో టాలీవుడ్ స్టార్ హీరోలు..!

Author Administrator | Published: Thursday, July 6, 2023, 06:07 PM [IST]

సినిమాల ప‌రంగా ఒక‌ప్పుడు భాషా ప‌ర‌మైన హ‌ద్దులుండేవి. కానీ మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఇవ‌న్నీ మారిపోయాయి. మ‌న తెలుగు ఆడియెన్స్‌ భాష‌తో సంబంధం లేకుండా ప్రేక్ష‌కులు ప‌ర భాషా హీరోల సినిమాలు చూస్తున్నారు. అలాగే ఇత‌ర భాషా సినీ ప్రేక్ష‌కులు సైతం మన సినిమాల‌ను ఆద‌రిస్తున్నారు. అందుకు త‌గ్గట్టు మ‌న హీరోలు ప‌ర భాషా ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేస్తున్నారు. చేయ‌బోతున్నారు. అలా లేటెస్ట్‌గా మ‌న హీరోల‌తో సినిమాలు చేస్తున్న ప‌ర భాషా ద‌ర్శ‌కులెవ‌రో చూద్దాం...


cover image
ప్రభాస్‌

బాహుబ‌లి త‌ర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఓ వైపు మ‌న ద‌ర్శ‌కుల‌తో పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే ప‌ర‌భాషా ద‌ర్శ‌కుల‌తో సినిమాలు  చేశారు. చేయ‌బోతున్నారు. రీసెంట్‌గా జూన్ 16న రిలీజైన ఆదిపురుష్ చిత్రానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌కుడు. సెప్టెంబర్ 28న రాబోతున్న స‌లార్ సినిమాను గ‌మ‌నిస్తే ఈ చిత్రాన్ని క‌న్న‌డ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించారు.  

రామ్ చరణ్ తేజ

ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం గేమ్ చేంజ‌ర్‌. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. భారీ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడిగా పేరున్న శంక‌ర్ డైరెక్ష‌న్‌లో గేమ్ చేంజ‌ర్ రూపొందుతోంది. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమా రిలీజ్ అనే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. 

జూనియర్ యన్ టి ఆర్

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌దుప‌రి చేస్తున్న రెండు సినిమాల‌ను ప‌ర‌భాషా ద‌ర్శ‌కులే తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. అందులో ఒక‌టి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. ఇక మ‌రో చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలు స‌మాంత‌రంగా తెర‌కెక్కుతాయ‌ని టాక్‌. 

గోపీచంద్‌

టాలీవుడ్ యాక్ష‌న్ హీరో ఇమేజ్ ఉన్న గోపీచంద్ తాజా చిత్రం భీమా. ఈ సినిమాను కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తుండ‌గా క‌న్న‌డలో వేద సినిమాను డైరెక్ట్ చేసిన హ‌ర్ష ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ప‌క్కా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఈ సినిమా తెర‌కెక్కుతోంది. 

వరుణ్ తేజ్

ప్ర‌స్తుతం గాంఢీవ‌ధారి అర్జున చిత్రాన్ని ప్రేక్ష‌కులు ముందుకు తీసుకు రావ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్న మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌.. నెక్ట్స్ మూవీని శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ హ‌డా డైరెక్ష‌న్‌లో చేయ‌బోతున్నారు. ఎయిర్ ఫోర్స్ ఫైలెట్ బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమా రూపొంద‌నుంది. ఇందులో మానుషి చిల్ల‌ర్ హీరోయిన్‌.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ - సాయిధ‌ర‌మ్ తేజ్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం బ్రో. జూలై 28న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి స‌ముద్ర ఖ‌ని ద‌ర్శ‌కుడు. నిజానికి ఇది త‌మిళ చిత్రం వినోద‌య సిత్తంకు రీమేక్‌. త‌మిళంలో న‌టిస్తూ స‌ముద్ర ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బ్రో సినిమాలో స‌ముద్ర ఖ‌ని పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తుండ‌గా..తంబి రామ‌య్య పాత్ర‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్నారు. మెయిన్ కాన్సెప్ట్ మాత్ర‌మే త‌మిళం నుంచి తీసుకుని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌కు త‌గ్గట్టు ఇందులో మార్పులు చేర్పులు చేశారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+