అదుర్స్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఎన్టిఆర్, నయనతార, షీలా బ్రహ్మానందం, షాయజీ షిండే, రాజ్యలక్ష్మి, ఆశిష్ విధ్యార్ది తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి వి వినాయక్ నిర్వహించారు మరియు నిర్మాత వల్లభనేని వంశి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
చిన్నప్పుడే విడిపోయిన కవల పిల్లలు ...ఒకరు నరసింహ(ఎన్టీఆర్),నరసింహాచారి(ఎన్టీఆర్)గా పెరిగి పెద్దవుతారు. వాళ్ళలో తల్లి(రాజ్య లక్ష్మి) దగ్గర పెరిగిన నరిసింహం పోకిరి సినిమాలో మహేష్ లా అండర్ కవల్ పోలీస్ లాగ పనిచేస్తూ సిటీలో గూండా ముఠాలను ఏరివేస్తూంటాడు. మరొకడు బ్రహ్మాణ కుటుంబంలో పెరిగి బ్రహ్మానందం (పురోహితుడు) దగ్గర అసెస్టింట్ గా పనిచేస్తూంటాడు. ఇక వీరిద్దరి తండ్రి(నాజర్)ని విలన్(మహేష్ ముంజ్రేకర్) కిడ్నాప్ చేసి ఆయుధాలు తయారు చేయటానికి ప్రయత్నిస్తూంటాడు. ఈ క్రమంలో ఈ విడిపోయిన అన్నదమ్ములు ఎలా కలుస్తారు. తమ తండ్రిని ఎలా రక్షించుకుంటారనేది మిగతా కథ.