అజ్ఞాతవాసి సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కల్యాణ్, కీర్తి సురేష్, అను ఎమ్మానుయెల్, ఆది పినిశెట్టి, ఖుషుబు, రావు రమేష్, బోమన్ ఇరాణి, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, అజై తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ వహించారు మరియు నిర్మాత కె రాధకృష్ణన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించారు.
కథ
విందా భార్గవ్ (బోమన్ ఇరానీ) ఓ పెద్ద పారిశ్రామికవేత్త. ఏబీ అనే సంస్థకు అధిపతి. భాగస్వాముల కుట్ర కారణంగా తన కుమారుడితోపాటు విందా భార్గవ్ చనిపోతాడు. దాంతో ఏబీ కంపెనీ బాధ్యతలు విందా భార్య ఇంద్రాణి (ఖుష్బూ) చేతికి వస్తాయి. అయితే సీతారాం (ఆది పినిశెట్టి), శర్మ (మురళీ శర్మ) వర్మ (రావు రమేష్) అడ్డుపడుతారు. వీరందరిని ఎదుర్కోవడానికి ఎక్కడో అసోంలో ఉన్న బాలు అలియాస్ బాలసుబ్రమణ్యం (పవన్ కల్యాణ్)ను రప్పించుకొంటారు. ఇంద్రాణి కోరిక మేరకు రంగంలోకి దిగిన బాలు ఏ విధంగా పరిస్థితిని చక్కదిద్దారు? ఏబీ కంపెనీని తమ చేతుల్లోకి తీసుకోవడానికి బాలుతో కలిసి ఇంద్రాణి ఏమి చేసింది. సీతారాం, శర్మ, వర్మలకు ఏ విధంగా బుద్ధి చెప్పింది. చిన్నస్థాయి ఉద్యోగిగా కంపెనీలోకి ప్రవేశించిన బాలు కంపెనీ సీఈవోగా మారేందుకు అభిషిక్త్ భార్గవ్‌గా ఎందుకు మారాడు? ఏబీ కంపెనీకి సూర్యకాంతం (అను ఇమ్మాన్యుయేల్), సుకుమారి (కీర్తి సురేష్) ఏమిటి సంబంధం అనే ప్రశ్నలకు సమాధానమే అజ్ఞాతవాసి చిత్ర కథ.
.