X
తెలుగు » సినిమాలు » అజ్ఞాతవాసి
అజ్ఞాతవాసి

అజ్ఞాతవాసి

Action | Romance | 10 Jan 2018 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

అజ్ఞాతవాసి స్టోరీ

అజ్ఞాతవాసి సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కల్యాణ్, కీర్తి సురేష్, అను ఎమ్మానుయెల్, ఆది పినిశెట్టి, ఖుషుబు, రావు రమేష్, బోమన్ ఇరాణి, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, అజై  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ వహించారు మరియు నిర్మాత కె రాధకృష్ణన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించారు. కథ విందా భార్గవ్ (బోమన్ ఇరానీ) ఓ పెద్ద పారిశ్రామికవేత్త. ఏబీ అనే సంస్థకు అధిపతి. భాగస్వాముల కుట్ర కారణంగా తన కుమారుడితోపాటు విందా భార్గవ్ చనిపోతాడు. దాంతో ఏబీ కంపెనీ బాధ్యతలు విందా భార్య ఇంద్రాణి (ఖుష్బూ) చేతికి వస్తాయి. అయితే సీతారాం (ఆది పినిశెట్టి), శర్మ (మురళీ శర్మ) వర్మ (రావు రమేష్) అడ్డుపడుతారు. వీరందరిని ఎదుర్కోవడానికి ఎక్కడో అసోంలో ఉన్న బాలు అలియాస్ బాలసుబ్రమణ్యం (పవన్ కల్యాణ్)ను రప్పించుకొంటారు. ఇంద్రాణి కోరిక మేరకు రంగంలోకి దిగిన బాలు ఏ విధంగా పరిస్థితిని చక్కదిద్దారు? ఏబీ కంపెనీని తమ చేతుల్లోకి తీసుకోవడానికి బాలుతో కలిసి ఇంద్రాణి ఏమి చేసింది. సీతారాం, శర్మ, వర్మలకు ఏ విధంగా బుద్ధి చెప్పింది. చిన్నస్థాయి ఉద్యోగిగా కంపెనీలోకి ప్రవేశించిన బాలు కంపెనీ సీఈవోగా మారేందుకు అభిషిక్త్ భార్గవ్‌గా ఎందుకు మారాడు? ఏబీ కంపెనీకి సూర్యకాంతం (అను ఇమ్మాన్యుయేల్), సుకుమారి (కీర్తి సురేష్) ఏమిటి సంబంధం అనే ప్రశ్నలకు సమాధానమే అజ్ఞాతవాసి చిత్ర కథ.    . 
Read More

అజ్ఞాతవాసి కాస్ట్ & క్రూ

అజ్ఞాతవాసి సిబ్బంది సమాచారం

దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాత ఎస్ రాధా కృష్ణ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అజ్ఞాతవాసి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అజ్ఞాతవాసి చిత్రం ఓ యాక్సిడెంట్‌తో ప్రారంభం కావడంతోపాటు బోమన్ ఇరానీ హత్య చకచకా జరిగిపోతాయి. ఆ తర్వాత పవన్ ఎంట్రీ, ధగధగమనే పాటతో సినిమా సరైన దిశలోనే వెళ్తుందనే భావన కలుగుతుంది. ఎప్పుడైతే ఏబీ కంపెనీలోకి పవన్ ప్రవేశించడానికి జరిగే నాటకం మొదలైన తర్వాత సినిమా గ్రాఫ్ దారుణంగా పడిపోతుంది. కథ ఎటువైపు వెళ్తుంది? పవన్ క్యారెక్టర్ ఏమిటనే ఆలోచన మొదలవుతుంది. మధ్యలో అను ఇమ్మాన్యుయేల్, కీర్తీ సురేష్ ఎపిసోడ్స్ చాలా నాసిరకంగా ఉంటాయి. తొలిభాగంలో ఎలాంటి లాజిక్స్ లేకుండా విచ్చలవిడిగా సీన్లు వచ్చిపోతుంటాయి. అలా ఏదో ఒకటి జరుగుతున్న అనే ఫీలింగ్స్ మధ్య ఓ ట్విస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడటంతో రెండో భాగంపై ఆసక్తి పెరుగుతుంది. రెండో భాగంలో విందా జీవిత కథ ఫ్లాష్‌బ్యాక్‌లో ఓపెన్ కావడంతో అసలు కథ మొదలవుతుంది. పవన్ క్యారెక్టర్ ఏంటో రివీల్ అవుతుంది? ఇక రెండో భాగంలో ఏదైనా మంచి సన్నివేశాలు ఉంటాయని భావించిన ప్రేక్షకులకు నిరాశే మిగిలుతుంది. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేవిధంగా ఆఫీస్ ఎపిసోడ్స్ చాలా దారుణంగా చిత్రీకరించడం సినిమాకు మైనస్‌గా మారుతుంది. రొటీన్ పవన్ కల్యాణ్ తరహా కామెడీతో సినిమా క్లైమాక్స్‌కు వెళ్తుంది. అయితే అత్తారింటికి దారేది తరహా క్లైమాక్స్ ఉంటుందేమోనని ఆశించిన ప్రేక్షకులకు మరో షాక్ తగులుతుంది. సినిమా చాలా నీరసంగా, నిస్సారంగా ముగుసుంది. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు ఆమడదూరంలో అజ్ఞాతవాసి చిత్రం కథ ఉంటుంది. చిన్న పాయింట్‌తో స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేద్దామనే ఆలోచన బెడిసికొట్టిందనే చెప్పవచ్చు. పాత్రల క్యారెక్టరైజేషన్, కథలో లింకులు, అనేక లోపాలు కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి. లాజిక్‌ లేకుండా ఊహకు అందని సన్నివేశాలు ఉంటాయి. అనేక లోపాలు ఉన్న కథను ప్రేక్షకుడి దగ్గరికి తీసుకెళ్లడానికి పెద్ద యుద్ధమే చేసినట్టు కనిపిస్తుంది. వెరసిగా హ్యాట్రిక్ కొట్టే సినిమాకు కథ, కథనాలు ఓ శాపంగా మారాయని చెప్పవచ్చు.

అజ్ఞాతవాసి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అజ్ఞాతవాసి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+