X
అహింస
Action | 02 Jun 2023 | U/A | 162 Mins
Telugu

అహింస స్టోరీ

అహింస మూవీ యాక్షన్,  థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారి, బిందు చంద్ర మౌళి, కల్పలత,  సదా, రజత్ బేడి, రవి కాలే, కమల్ కామరాజు,  దేవి ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తేజ వహించారు. నిర్మాత  కిరణ్  నిర్మించారు. సంగీతం ఆర్ పి పట్నాయక్ అందించారు. 

కథ
రఘు (అభిరామ్ దగ్గుబాటి), అహల్య (గీతిక తివారీ) బావ మరదల్లు. అహల్య అంటే రఘుకు ప్రాణం, బావ రఘు అంటే అహల్యకు చెప్పలేనంత ఇష్టం. స్వతహాగా రఘు హింసకు దూరంగా ఉండే వ్యక్తి. తన జీవితంగా భావించే మరదలు గీతికపై బిజినెస్ మ్యాన్ ధనలక్ష్మి దుష్యంత్ రావు (రజత్ బేడీ) కుమారులు మానభంగానికి పాల్పడుతారు. చావు బతుకుల్లో ఉన్న మరదల్ని బతికించేందుకు రఘు ఓ వైపు ప్రయత్నిస్తుండగా.. మరో వైపు తన కుమారులను రక్షించుకోవడానికి దుష్యంత్ రావు కుట్రలు పన్నుతుంటాడు. కోర్టులో సాక్ష్యం చెప్పకుండా గీతిక, రఘు కుటుంబాలపై దుష్యంత్ దాడులకు దిగుతాడు. మరదలు మానభంగానికి గురైన నేపథ్యంలో రఘు రియాక్షన్ ఏంటి? అహల్యను రక్షించుకునేందుకు రఘు ఏం చేశాడు? తన మరదలిపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు యువకులకు శిక్ష పడేందుకు రఘు ఏ విధంగా ప్రయత్నించాడు. అహల్య రేప్ కేసును లాయర్ లక్ష్మీ (సదా) న్యాయపోరాటం ఫలించిందా? తన కుమారులకు శిక్ష పడేందుకు ప్రయత్నిస్తున్న రఘును అడ్డుకొనేందుకు దుష్యంత్ రావు ఎలాంటి దుష్టపన్నాగాలను పన్నాడు? చివరకు అహల్యపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులు, దుష్యంత్ రావుపై రఘు ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? ఏ పరిస్థితుల్లో అహింసావాది రఘు హింసను ఆయుధంగా చేసుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే అహింస సినిమా 

ట్రైలర్‌
ఇక పేదవాడైన హీరోకు ఎలాంటి కష్టాలు ఎదురవుతాయి.. అతడు వాటిని ఎలా అధిగమిస్తాడు.. అతడికి ఈ క్రమంలో ఎవరు సాయం చేస్తారు అనే అంశాలతో ఈ సినిమా కథ ఉండబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ ఈ సినిమాపై మంచి వైబ్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో అభిరామ్ లుక్ కూడా ప్రేక్షకులకు నచ్చడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

రిలీజ్
అహింస మూవీ  జూన్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+