అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా డ్రామా, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అజ్మల్ అమీర్, ధీరజ్ కెవి, స్వప్న, ధన్ రాజ్, బ్రహ్మానందం, అలీ, అరవింద్ రావు, మహేష్ కత్తి ఇంకా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ వహించారు. ఈ సినిమాను అజయ్ మైసూర్ ప్రొడక్షన్, టైగర్ కంపెనీ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. సంగీతం రవి శంకర్ అందించారు.
కథ
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుంది. అప్పటి వరకు పాలించిన వెలుగు దేశం పార్టీకి ఘోర పరాభవం ఎదురవుతుంది. ఇక తన కొడుకును ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న బాబుకు గట్టి ఎదురెబ్బ తగులుతుంది. ఎలాగైనా మళ్లీ అధికార పీఠం ఎక్కాలని ఎత్తులు పైఎత్తులు వేస్తుంటారు. ఈ రాజకీయ రణరంగంలోని హత్యా రాజకీయాలతో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీఎస్ జగన్నాథ్ రెడ్డి (అజ్మల్ అమీర్)కు ఎదురైన సవాళ్లు, అధిగమించిన తీరు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు కథ.
ఈ సినిమా ద్వారా ఒక నీతిని కూడా తెలియజేశారు వర్మ. రాజకీయాల్లో అయినా, మీడియాలో అయినా, సినిమాల్లో అయినా ప్రజలకు కావాల్సింది కేవలం ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే.