ఆనందో బ్రహ్మ సినిమా హార్రర్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తాప్సి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, శకలక శంకర్, రాజీవ్ కనకాల, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, విద్యుల్లేఖ రామన్, ప్రభాస్ శ్రీను, అదుర్స్ రఘు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మహి వి రాఘవ్ వహించారు మరియు నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కె అందించారు.
కథ
మలేషియా బేస్డ్ ఎన్నారై (రాజీవ్ కనకాల) తల్లిదండ్రులు ఉత్తరాఖండ్ వరదల్లో ఆచూకీ లేకుండా పోతారు. వాళ్ల ఆచూకీ కోసం ఇండియా వస్తాడు. పోలీసులు వారు చనిపోయి ఉంటారని చెప్పడంతో ఇల్లు అమ్మేసి మలేషియా వెళ్లిపోదామని డిసైడ్ అయిపోతాడు. ఇల్లు అమ్మకానికి పెట్టగా కొనడానికి వచ్చిన వారు ఆ ఇంట్లో దయ్యాలను చూసి కొనకుండా వెళ్లిపోతారు. ఆ ఇంటిని ఎవరు కొనడానికి వచ్చినా..... ఆ ఇంట్లో దెయ్యాలుగా ఉన్న తాప్సీ, విజయ్ చందర్, రఘు, మరో పిల్లదెయ్యం అందరినీ భయపెట్టి బయటకు తరిమేస్తుంటారు. దెయ్యం బూచి చూపి 10 కోట్ల విలువ చేసే ఆ ఇంటిని రూ. 1 కోటికి దక్కించుకోవాలని స్థానిక బిల్డర్ ప్లాన్ చేస్తాడు. ఆ ఇంటి సమస్యను తెలుసుకున్న బార్ వెయిటర్ శ్రీనివాసరెడ్డి ఆ ఇంట్లో దెయ్యాలు లేవని తాను నిరూపిస్తానని, నాలుగు రోజుల పాటు ఆ ఇంట్లో ఉండి మంచి రేటుకు అమ్ముడుపోయేలా చేస్తామని, తనకు కొంత కమీషన్ ఇవ్వాలని కోరుతాడు. తనలాగే డబ్బు అవసరం ఉన్న తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, షకలక శంకర్‌లకు మీ కష్టాలు తీరేంత డబ్బు ఇప్పిస్తానని చెప్పి.....ఆ దెయ్యాల కొంపలో నాలుగు రోజులు గడిపేందుకు వారితో కలిసి వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ నాలుగు దెయ్యాలు అదే ఇంట్లో ఉండటానికి కారణం ఏమిటి? వారి చావుకు కారణం ఏమిటి? అనేది తర్వాతి కథ.