X
Home టాప్ లిస్టింగ్

2023 ఏప్రిల్ నెలలో రిలీజ్ కానున్న మూవీస్ లిస్ట్

Author Administrator | Updated: Tuesday, April 4, 2023, 10:09 AM [IST]

2023 ఏప్రిల్ పాన్ ఇండియా, చిన్న సినిమాలతో ముస్తాబవుతోంది. రవితేజ, అఖిల్ , కిరణ్ సబ్బవరం, సమంత, విక్రమ్ వంటి స్టార్స్ తో పాటు మీడియం హీరోలు కూడా ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వేసవి సెలవులను క్యాష్ చేసుకునేందుకు క్రేజీ సినిమాలు సిద్ధం అవుతున్నాయి. ఏప్రిల్ లో ప్రేక్షకులను అలరించడానికి క్రేజీ సినిమా లు రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. లిస్ట్ ఒకసారి చూద్దాం రండి


cover image
రావణాసుర
1

సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న రావణాసుర సినిమా ఏప్రిల్ 7న పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. మాస్ మహారాజా రవితేజ మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, అనూ ఇమ్మాన్యూయేల్, పూజిత పొన్నాడ వంటి ముద్దుగుమ్మలు గ్లామర్ తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్న ఈ మూవీలో అక్కినేని సుశాంత్ విలన్ గా అలరించనున్నాడు.

మీటర్
2

యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో మళ్లీ తిరిగి హిట్‌ ట్రాక్‌లోకి వచ్చాడు. గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న కిరణ్‌కు ఈ సినిమా కాస్త ఊరటనిచ్చింది. ఇక ఇప్పుడు అదే జోష్‌తో మీటర్‌ తో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. రమేష్ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.

శాకుంతలం
3

టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కింది. అందమైన ప్రేమ కావ్యంగా, ఎపిక్ మైథాలాజికల్ మూవీగా వస్తున్న శాకుంతలం సినిమాను ఏప్రిల్ 14న పాన్ ఇండియాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

విరూపాక్ష
4

సాయి ధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సుకుమార్ కథ సిద్ధం చేసిన ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 21న విడుదల కానుంది.

5

రాఘవ లారెన్స్. ముఖ్యంగా ఆయన హారర్ చిత్రాలతో బాగా పాపులర్ అయ్యాడు. ఆయన హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రుద్రుడు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పొన్నియన్ సెల్వన్-2
6

విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభితా ధూలిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మీ వంటి స్టార్ క్యాస్ట్ నటించిన ఈ సినిమా రెండో పార్టు ఏప్రిల్ 28న విడుదల కానుంది. వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఏజెంట్‌
7

అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

PVT04
8

 పంజా వైష్ణవ్ తేజ్ కెరీర్ లోని నాలుగో చిత్రం PVT04 విడుదల కానుంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+