X
తెలుగు » సినిమాలు » ఆనందో బ్రహ్మ
ఆనందో బ్రహ్మ

ఆనందో బ్రహ్మ

Horror | 18 Aug 2017 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఆనందో బ్రహ్మ స్టోరీ

ఆనందో బ్రహ్మ సినిమా హార్రర్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తాప్సి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, శకలక శంకర్, రాజీవ్ కనకాల, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, విద్యుల్లేఖ రామన్, ప్రభాస్ శ్రీను, అదుర్స్ రఘు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మహి వి రాఘవ్ వహించారు మరియు నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కె అందించారు.  కథ మలేషియా బేస్డ్ ఎన్నారై (రాజీవ్ కనకాల) తల్లిదండ్రులు ఉత్తరాఖండ్ వరదల్లో ఆచూకీ లేకుండా పోతారు. వాళ్ల ఆచూకీ కోసం ఇండియా వస్తాడు. పోలీసులు వారు చనిపోయి ఉంటారని చెప్పడంతో ఇల్లు అమ్మేసి మలేషియా వెళ్లిపోదామని డిసైడ్ అయిపోతాడు. ఇల్లు అమ్మకానికి పెట్టగా కొనడానికి వచ్చిన వారు ఆ ఇంట్లో దయ్యాలను చూసి కొనకుండా వెళ్లిపోతారు. ఆ ఇంటిని ఎవరు కొనడానికి వచ్చినా..... ఆ ఇంట్లో దెయ్యాలుగా ఉన్న తాప్సీ, విజయ్ చందర్, రఘు, మరో పిల్లదెయ్యం అందరినీ భయపెట్టి బయటకు తరిమేస్తుంటారు. దెయ్యం బూచి చూపి 10 కోట్ల విలువ చేసే ఆ ఇంటిని రూ. 1 కోటికి దక్కించుకోవాలని స్థానిక బిల్డర్ ప్లాన్ చేస్తాడు. ఆ ఇంటి సమస్యను తెలుసుకున్న బార్ వెయిటర్ శ్రీనివాసరెడ్డి ఆ ఇంట్లో దెయ్యాలు లేవని తాను నిరూపిస్తానని, నాలుగు రోజుల పాటు ఆ ఇంట్లో ఉండి మంచి రేటుకు అమ్ముడుపోయేలా చేస్తామని, తనకు కొంత కమీషన్ ఇవ్వాలని కోరుతాడు. తనలాగే డబ్బు అవసరం ఉన్న తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, షకలక శంకర్‌లకు మీ కష్టాలు తీరేంత డబ్బు ఇప్పిస్తానని చెప్పి.....ఆ దెయ్యాల కొంపలో నాలుగు రోజులు గడిపేందుకు వారితో కలిసి వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ నాలుగు దెయ్యాలు అదే ఇంట్లో ఉండటానికి కారణం ఏమిటి? వారి చావుకు కారణం ఏమిటి? అనేది తర్వాతి కథ.
Read More

ఆనందో బ్రహ్మ కాస్ట్ & క్రూ

ఆనందో బ్రహ్మ సిబ్బంది సమాచారం

దర్శకత్వం మహి వి రాఘవ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కె
నిర్మాత విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆనందో బ్రహ్మ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
దెయ్యం పాత్రలో తాప్సీ ఫర్వాలేదు. అయితే ప్రేక్షకులు భయపడేంత హారర్ మాత్రం ప్రదర్శించలేకే పోయింది. విజయ్ చందర్, రఘు, మరో పిల్ల దెయ్యం కూడా జస్ట్ ఓకే. వాస్తవానికి వారు దెయ్యాలుగా మారక ముందు భయస్తులు. దెయ్యాలుగా మారిన తర్వాత కూడా అదే భయంతో జీవిస్తుంటారు. అందుకే దర్శకుడు వీరిని మరీ అంత భయంకరంగా చూపించలేదని భావించవచ్చు. శ్రీనివాసరెడ్డి, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, షకలక శంకర్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. గుండె జబ్బున్న పాత్రలో శ్రీనివాస రెడ్డి, సినిమా పిచ్చోడి పాత్రలో షకలక శంకర్, తాగుబోతు పాత్రలో రమేష్, చెవుడు... రేచీకటి పాత్రలో వెన్నెల కిషోర్.......... తమ తమ చేష్టలతో ప్రేక్షకులను బాగా నవ్వించారు. కథ అంత గొప్పగా ఏమీ లేదు..... ఓ ఇల్లు, ఆ ఇంట్లో ఉండే మనుషులు, వారి హత్య, తర్వాత దెయ్యాలుగా ఎందుకు మారాల్సి వచ్చింది అనే ఓ కంక్లూజన్‌తో సింపుల్ స్టోరీ సిద్ధం చేసుకున్నారు. అయితే స్క్రీన్ ప్లేలో ఎక్కడా బోర్ కొట్టకుండా హారర్, కామెడీ జోడించి వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కించారు. దర్శకుడి పని తీరు ఫర్వా లేదు.

ఆనందో బ్రహ్మ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఆనందో బ్రహ్మ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+