ఆంద్రపోరి సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆకాష్ పూరి, ఉల్కా గుప్త, పూర్ణిమ, ఈశ్వరి రావు, ఆరవింద్ కృష్ణ, శ్రీముఖి, ఉత్తేజ్, అభినయ, శ్రీ తేజ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజ్ మదిరాజు నిర్వహించారు మరియు నిర్మాత రమేష్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు డా జే రాజశేఖర్ వర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
నిజామాబాద్ కుర్రాడు నర్సింగ్ (ఆకాష్ పూరి) ఓ పేద కుర్రాడు. అతని తల్లి యాదమ్మ(ఈశ్వరి) కు తన కొడుకు బాగా చదువుకుని గొప్పవాడవ్వాలనేది కల. అయితే నర్శింగ్ అందుకు విరుద్దంగా ఆవారాగా తిరుగుతూంటాడు. అంతేకాకుండా...అదే కాలనీలో ఉండే ప్రశాంతి(ఉల్కా గుప్త) తో ప్రేమలో పడతాడు. మొదట్లో ప్రశాంత్ పట్టించుకోకపోయినా తర్వాత యస్ అంటుంది. అక్కడ నుంచి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూంటారు. అయితే వీరి ప్రేమకు ..ప్రశాంతి తండ్రి గోపాలరావు(డా.శ్రీకాంత్) అడ్డుపడతాడు. ఆ తర్వాత ఏమైంది...వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపు తీసుకుంది...నర్సింగ్ తల్లి కల ఏమైంది అనేది మిగతా కథ.