X
Home టాప్ లిస్టింగ్

ఈ వారం థియేటర్లు మరియు ఓటిటి లో ప్రేక్షకుల ముందుకు ఇంట్రెస్టింగ్ సినిమాలు

Author Administrator | Published: Wednesday, May 24, 2023, 07:11 PM [IST]

ఈ వారం థియేటర్లు మరియు ఓటిటి లో ప్రేక్షకుల ముందుకు ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తున్నాయి. కొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలానే ఈ థియేట్రికల్ విడుదలలు మాత్రమే కాకుండా, ఓటిటి కంటెంట్ కూడా ఆడియన్స్ ముందుకు వస్తోంది. కాబట్టి, ఈ వారాంతంలో వారు ఆస్వాదించే వినోదాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.


cover image
మళ్ళీ పెళ్ళి
1

నరేష్, పవిత్ర లోకేష్ జంటగా ఈ సినిమాని తమ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తరిగెక్కించారని తెలుస్తోంది. నరేష్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా ఒకప్పటి నిర్మాత ఇప్పుడు దర్శకుడిగా మారిన ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

మేమ్ ఫేమస్
2

సుమంత్ ప్రభాస్ లీడ్‌‌ రోల్‌‌లో నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘మేమ్ ఫేమస్‌‌’. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి నిర్మించారు. ఈ సినిమా మే 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

 

మెన్ టూ
3

యంగ్ హీరో నరేష్ అగస్త్య హీరోగా సీనియర్ నటుడు బ్రహ్మాజీ కూడా ఓ కీలక పాత్రలో దర్శకుడు శ్రీకాంత్ జి రెడ్డి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం “మెన్ టూ”. ఓ ఇంట్రెస్టింగ్ కామెడీ ఎంటర్టైనర్ గా మే 26న అయితే రిలీజ్ కానుంది 

 

4

మలయాళం సినిమాలకు తెలుగు లో మంచి డిమాండ్ ఉంది.కొన్ని సినిమాలను రీమేక్‌ చేస్తుంటే మరికొన్ని సినిమాలను డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.మలయాళం లో ఇటీవల విడుదలై చాలా తక్కువ సమయం లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసిన 2018 సినిమా ను తెలుగు లో డబ్బింగ్ ఈ వారంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది 

సత్తి గాని రెండెకరాలు
5

భారీ సినిమాలని తెరకెక్కిస్తూ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ సత్తిగాని రెండెకరాలు అనే కామెడీ, సస్పెన్స్ సినిమాని తెరకెక్కించింది. ఈ సినిమా ఆహా ఓటీటీలో మే 26 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సినిమాలో 'వెన్నెల' కిశోర్‌, బిత్తిరి సత్తి, అనీషా దామా, మోహనశ్రీ, కూడా కీలక పాత్రల్లో కనిపించ బోతున్నారు.

దసరా
6

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా సూపర్ హిట్ అయింది. పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది. తెలుగులో ఓటీటీలోకి వచ్చింది. హిందీ వెర్షన్ మే 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+