twitter

    అర్జున ఫాల్గుణ స్టోరి

    అర్జున ఫాల్గుణ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీ విష్ణు, అమృత అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవి శ్రీ ప్రసాద్, జబర్దస్త్ మహేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తేజ మార్ని వహించారు. నిర్మాత నిరంజన్ రెడ్డి, అవేశ్ రెడ్డి నిర్మించారు. ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం సంగీతం అందించారు. 

    కథ
    గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో అర్జున్ (శ్రీవిష్ణు) తన నలుగురు స్నేహితులు (మహేష్ ఆచంట తదితరులు) ఎలాంటి పని పాట లేకుండా తిరుగుతుంటారు. శ్రావణి ( అమృత అయ్యర్)తో ప్రేమలో ఉంటాడు. అయితే కష్టాల్లో ఎవరైనా ఉంటే వారిని ఆదుకొనేందుకు అర్జున్ ఎంతకైనా తెగిస్తాడు. తన స్నేహితులకు వచ్చిన కష్టాలు తీర్చడానికి గంజాయి స్మగ్లింగ్ చేయడానికి తన స్నేహితులతో సిద్ధమవుతాడు. అరకు నుంచి గంజాయిని తీసుకొస్తుంటే ఇన్స్‌పెక్టర్ సుబ్బరాజు (సుబ్బరాజు)కు దొరికిపోతారు. చట్ట వ్యతిరేకమైన గంజాయి దందాలోకి ఏ పరిస్థితుల్లో అర్జున్ అడుగుపెట్టాడు? తన స్నేహితుడికి వచ్చిన కష్టం ఏమిటి? గంజాయి బస్తాను తరలించే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? గంజాయి బస్తా కోసం సీఐ సుబ్బారాజు ఎందుకు వెతుకుతున్నాడు? గంజాయి బస్తాలో ఉన్న ట్విస్ట్ ఏమిటి? గంజాయి బస్తా అర్జున్, తన స్నేహితులను కష్టాలను నుంచి ఎలా గట్టెక్కించింది? అనే ప్రశ్నలకు సమాధానమే అర్జున ఫాల్గుణ సినిమా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie అర్జున ఫాల్గుణ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X