బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సినిమాలు రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒకటి కి మించి ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సాలిడ్ కలెక్షన్స్ ని సాధిస్తూ మొదటి రోజు 40 కోట్ల నుండి 100 కోట్ల రేంజ్ కి ఎగబాకాయి. మన తెలుగు రాష్టాలలో కూడా పెద్ద హీరోలా సినిమాలకి ఫస్ట్ డే 20 కోట్ల నుండి 50 కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి. ఇక బాహుబలి అయితే ఎవ్వరికీ అందనంత ఎత్తులో వసూళ్లు సాధించి టాప్ లో ఉంది. ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణలో తొలిరోజు వసూలు చేసిన అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలేంటో చూద్దాం..