X
అశోకవనంలో అర్జున కళ్యాణం
Romance | 06 May 2022 | U/A | 149 Mins
Telugu

అశోకవనంలో అర్జున కళ్యాణం స్టోరీ

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో విశ్వక్ సేన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో, ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్ మీద ఆయన తనయుడు బాపినీడు సుధీర్ ఈదరతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : రవి కిరణ్ కోలా, సంగీతం : జయ్ కృష్ణ, ఎడిటింగ్ : విప్లవ్.

కథ

తెలంగాణలోని సూర్యాపేట్‌కు చెందిన వడ్డీవ్యాపారి అర్జున్ (విశ్వక్ సేన్). 32 ఏళ్లు దాటినా పెళ్లికాని ప్రసాద్‌గా ఉంటాడు. ప్రతీసారి ఏదో కారణంతో పెళ్లి వాయిదాలు పడుతుంటాయి. అయితే చివరకు ఆంధ్రాలోని అశోక్ పురానికి చెందిన మాధవి (రుక్సార్ థిల్లాన్)తో పెళ్లిచూపులు జరుగుతాయి. పెళ్లి చూపుల తర్వాత కొన్ని కారణాల వల్ల మాధవి ఇంటిలోనే అర్జున్ కుటుంబం ఉండిపోవాల్సి వస్తుంది. తొలి చూపులోనే అర్జున్ మనసు దోచుకొన్న మాధవి మరో యువకుడు (అశోక్ సెల్వన్)‌తో లేచిపోతుంది. పెళ్లిచూపులు జరిగిన తర్వాత అర్జున్ కుటుంబం మాధవి గ్రామంలోనే ఎందుకు ఉండిపోయింది? ఏ పరిస్థితుల్లో ఎవరికి చెప్పపెట్టకుండా మాధవి లేచిపోయింది? వసుధ (రితికా నాయక్)‌కు అర్జున్‌కు సంబంధం ఏమిటి? చివరకు అర్జున్ పెళ్లి జరిగిందా? పెళ్లి జరిగితే ఎవరితో జరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే అశోకవనంలో అర్జున కల్యాణం మూవీ కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+