ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ సినిమాలకు బెస్ట్ సీజన్ అని చెప్పవచ్చు. రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలన్నీ మంచి వసూళ్లను రాబడుతుంటాయి. గత ఏడాది రెండు భారీ సినిమాలు సాధించిన వసూళ్లు మనం ఇప్పట్లో మర్చిపోలేము. కరోనా కారణంగా సినిమా హాళ్లు మూసివేయ్యడంతో ఈసారి వేడుక ఉండదేమో అనుకున్నారు అంతా. కానీ.. ఎప్పటిలాగే ఈ సారి కూడా తెలుగు వెండితెర మీద సందడి చేయడానికి సిద్ధమయ్యాయి మన సినిమాలు.ఆ చిత్రాలు ఏంటో చూద్దాం.