అశ్వథ్థామ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ శౌర్య, మెహరీన్ పిర్జాదా, జయప్రకాష్, ప్రిన్స్, సంజై స్వరూప్, సురేఖ వాణి, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రమణ తేజ వహించారు. ఊషా ముల్పూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్ పాకాల అందించారు.
కథ
యూఎస్ రిటర్న్ గణ (నాగశౌర్య) హ్యాపీగా లైఫ్‌ను ఎంజాయ్ చేసే విశాఖపట్నం అబ్బాయి. తన విశాఖలో అమ్మాయిలు అదృశ్యం కావడం, ఆ తర్వాత మరుసటి రోజే కనపడటం జరుగుతుంటుంది. ఆ తర్వాత మూడు నెలలకు గర్భవతులు అవుతుంటారు. ఇలాంటి క్రమంలో తన సోదరికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురువుతుంది. విశాఖలో అమ్మాయిల కిడ్నాప్ వెనుక కుట్ర ఏమిటి? వారిని ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశాడు? అదృశ్యమైన అమ్మాయిలు గర్భవతులు కావడం వెనుక కారణమేమిటి? తన చెల్లెలికి జరిగిన అన్యాయానికి గుణ ఎలాంటి పరిష్కారం చూపారు. అమ్మాయిల కిడ్నాప్ చేసే ముఠాను గుణ ఎలా భగ్నం చేశాడు? చివరకు ఆ ముఠాకు ఎలా చెక్ పెట్టారు అనే ప్రశ్నలకు సమాధానమే అశ్వత్థామ సినిమా కథ.