X
Home టాప్ లిస్టింగ్

2023 ఫస్ట్ హాఫ్ టాప్ 5 డిజాస్టర్ తెలుగు మూవీస్

Author Administrator | Updated: Thursday, June 15, 2023, 06:35 PM [IST]

2023 ఫస్ట్ హాఫ్ టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్ చుస్తే ఒక పక్క బ్లాక్ బాస్టర్ మూవీస్ వున్నాయి.. మరో పక్క కొన్ని సినిమాలు దారుణంగా దెబ్బ కొట్టాయి. 2023 ఫస్ట్ హాఫ్ డిజాస్టర్ తో సరిపెట్టుకున్న చుస్తే.. బాక్సాఫీస్ కలెక్షన్ల మాట పక్కకుపెట్టు. కనీసం పెట్టిన పెట్టుబడి వస్తే చాలనుకునే నిర్మాతలకు ఈ సినిమాలు భారీగా నష్టాలు తెచ్చిపెట్టాయి. 2023 ఏడాది ఫస్ట్ హాఫ్ అత్యంత నష్టాలు తెచ్చిపెట్టిన టాప్ 5 సినిమాల లిస్ట్ మీ కోసం.


cover image
శాకుంతలం

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కింది. ఈ చిత్రం గుణశేఖర్, దిల్ రాజులకి ఏకంగా 50 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. గుణశేఖర్ చాలా నమ్మకంతో చేసిన ప్రేక్షకులు మాత్రం నచ్చలేదని స్పష్టమైన తీర్పు ఇచ్చారు. చారిత్రక పురాణం నేపథ్యం కలిగిన కథే అయినా ప్రేక్షకులు ఆదరించలేకపోయారు.

ఏజెంట్‌

అఖిల్, సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన్ ఏజెంట్ మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆ సినిమా ఏకంగా 33 కోట్లకి పైనే నష్టం వచ్చింది. 

కస్టడీ

నాగ చైతన్య కస్టడీ సినిమా కూడా ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న కమర్షియల్ గా డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ 18 కోట్ల నష్టం మిగిల్చింది. ఈ విధంగా అక్కినేని బ్రదర్స్ కు ఈ ఏడాది ఏమాత్రం కలిసి రాలేదు.

రామబాణం

గోపీచంద్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా రామబాణం సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ అతని ఖాతాలో మరో డిజాస్టర్ గా మారింది. ఈ చిత్రంతో ఏకంగా 16 కోట్ల నష్టం నిర్మాతకి వచ్చింది. 

రావణాసుర

రవితేజ, సుదీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రావణాసుర. ఈ చిత్రం ఊహించని టాక్ అయితే తెచ్చుకుంది. రవితేజ నుంచి ఫ్యాన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ మిస్ కావడం, స్క్రీన్ ప్లే లో లోపాల కారణంగా మూవీ థియేటర్స్ లో కమర్షియల్ ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రానికి 11 కోట్ల నష్టం వచ్చింది. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+