X
ఎటిఎం నాట్ వర్కింగ్
Comedy | Romance | 17 Mar 2017 |
Telugu

ఎటిఎం నాట్ వర్కింగ్ స్టోరీ

ఎటిఎం నాట్ వర్కింగ్ సినిమా కామిడి రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్, కారుణ్య, రాకేష్, మహేంద్ర, నారాయణ, ఆషా, మహేష్, కిశోర్ దాస్, తిరుపతి దొరై, వీరబాబు, చిల్లర రాంబాబు, ఆంజనేయులు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సునిల్ కుమార్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాతలు కిశోరి బసి రెడ్డి, యక్కలి రవింద్ర బాబు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రవీన్ ఇమ్మడి స్వరాలు సమకుర్చరు.

కథ

ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని సులభంగా డబ్బు సంపాదించే లక్ష్యంతో బతుకుతుంటారు అనంత్ (ఎ), త్రినాథ్ (టీ), మహేశ్ (ఎమ్) (ఎటిఎం). ఉన్నట్టుండి కోటీశ్వరులమైపోవాలనే దురాశతో మూడు లక్షలు అప్పుచేసి దొంగనోట్ల వ్యాపారానికి పూనుకొంటారు. దొంగనోట్లు ప్రింట్ అయి మార్కెట్ తరలించే నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకొంటారు. ప్రధాని నోట్ల రద్దు తర్వాత అనంత్, త్రినాథ్, మహేశ్‌ జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. ఈ క్రమంలో వారికి ఎదురైన సమస్యలు ఏంటీ? తెచ్చిన అప్పును ఎలా తీర్చారు? నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎలాంటి కష్టాలు పడ్డారు? అనే ప్రశ్నలకు తెరమీద దొరికే సమాధానాలే ఎటిఎం వర్కింగ్ చిత్రం. 

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+