X
తెలుగు » సినిమాలు » ఎటిఎం నాట్ వర్కింగ్
ఎటిఎం నాట్ వర్కింగ్

ఎటిఎం నాట్ వర్కింగ్

Comedy | Romance | 17 Mar 2017 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఎటిఎం నాట్ వర్కింగ్ స్టోరీ

ఎటిఎం నాట్ వర్కింగ్ సినిమా కామిడి రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్, కారుణ్య, రాకేష్, మహేంద్ర, నారాయణ, ఆషా, మహేష్, కిశోర్ దాస్, తిరుపతి దొరై, వీరబాబు, చిల్లర రాంబాబు, ఆంజనేయులు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సునిల్ కుమార్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాతలు కిశోరి బసి రెడ్డి, యక్కలి రవింద్ర బాబు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రవీన్ ఇమ్మడి స్వరాలు సమకుర్చరు. కథ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని సులభంగా డబ్బు సంపాదించే లక్ష్యంతో బతుకుతుంటారు అనంత్ (ఎ), త్రినాథ్ (టీ), మహేశ్ (ఎమ్) (ఎటిఎం). ఉన్నట్టుండి కోటీశ్వరులమైపోవాలనే దురాశతో మూడు లక్షలు అప్పుచేసి దొంగనోట్ల వ్యాపారానికి పూనుకొంటారు. దొంగనోట్లు ప్రింట్ అయి మార్కెట్ తరలించే నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకొంటారు. ప్రధాని నోట్ల రద్దు తర్వాత అనంత్, త్రినాథ్, మహేశ్‌ జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. ఈ క్రమంలో వారికి ఎదురైన సమస్యలు ఏంటీ? తెచ్చిన అప్పును ఎలా తీర్చారు? నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎలాంటి కష్టాలు పడ్డారు? అనే ప్రశ్నలకు తెరమీద దొరికే సమాధానాలే ఎటిఎం వర్కింగ్ చిత్రం.   
Read More

ఎటిఎం నాట్ వర్కింగ్ కాస్ట్ & క్రూ

ఎటిఎం నాట్ వర్కింగ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సునిల్ కుమార్ రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రవీణ్ ఇమ్మడి
నిర్మాత కిశోరి బసి రెడ్డి, యక్కలి రవింద్ర బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఎటిఎం నాట్ వర్కింగ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
టాలీవుడ్‌లో చక్కటి అభిరుచి, సామాజిక బాధ్యత ఉన్న దర్శకుల్లో సునీల్ కుమార్ రెడ్డి ప్రత్యేకమైన స్థానం. రొటీన్ చిత్రాలకు భిన్నంగా సినిమాలను నిర్మించడంలో ఆయన శైలి విభిన్నమైనది. దేశ స్వాతంత్రం తర్వాత దేశ ప్రజలందరిపై ఎక్కువ ప్రభావం చూపిన అంశం పెద్ద నోట్ల రద్దు. ఈ అంశంపై వెంటనే స్పందించి సినిమాను రూపొందించడం అభినందనీయం. ఏటీఎం కష్టాలను, ఆ తర్వాత సమాజంలోని వివిధ వర్గాలపై పడిన ప్రభావాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు. పాకిస్థాన్ టెర్రరిజం నుంచి కుహనా రాజకీయల వరకు, సంపన్నుల నుంచి సామాన్య ప్రజల వరకు పడిన కష్టాలను గంటన్నర నిడివి ఉన్న చిత్రంలో ప్రభావవంతంగా చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే కథలో ఇంటెన్సిటీని చెప్పడంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం సినిమా రసవత్తరంగా సాగలేకపోయింది. పాత్రధారుల ఎంపిక ప్రధాన లోపం. అందుకు కారణం బడ్జెట్ పరిమితులు కావొచ్చు. కాకపోవచ్చు. కానీ కథలో ఉండే తీవ్రతను ప్రభావవంతంగా చెప్పడానికి నటీనటుల ఎంపిక, సాంకేతిక అంశాలు అవరోధంగా మారాయి. సామాజిక బాధ్యత సినిమాగా రూపొందిన ఈ చిత్రాన్ని సగటు ప్రేక్షకుడి వద్దకు తీసుకుపోయే అంశాలు చాలా తక్కువే. కొంతమొత్తంలో ఓ సెగ్మెంట్‌కు చేరువ అయితే అందుకు ప్రధాన కారణం దర్శకుడు పీ సునీల్ కుమార్ రెడ్డి అవుతారు. తాము అనుభవించిన నోట్ల కష్టాలను తెరమీద చూసుకొని ప్రేక్షకుడు సంతృప్తి చెందడంపైనే చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది.

ఎటిఎం నాట్ వర్కింగ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఎటిఎం నాట్ వర్కింగ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+