twitter

    ఎటాక్ స్టోరి

    ఎటాక్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు మనోజ్, సురబిజగపతి బాబు, వడ్డే నవీన్, ప్రకాష్ రాజు, మంజు భార్గవి, నరసింగ్ యాధవ్, అభిమన్య, చలపతి రావు
     తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ నిర్మించారు మరియు నిర్మాత మంచు విష్ణు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రవి శంకర్ స్వరాలు సమకుర్చారు.

    కథ

    గురురాజ్(ప్రకాష్ రాజ్) హైదరాబాద్‌లో పెద్ద రౌడీ. సెటిల్మెంట్లు, దందాలు చేస్తుండేవాడు. కానీ కొంతకాలం తర్వాత కుటుంబం కోసం అన్నీ వదిలేసి బిజినెస్ చేస్తూ జీవిస్తుంటాడు. రౌడీయిజం వదిలేసినా ప్రమాదమే. ఈ విషయం గురురాజ్ కు కూడా తెలుసు. అందుకే తన జాగ్రత్తలో తానుంటాడు. ఈ క్రమంలో జరిగిన ఓ ఎటాక్ లో గురురాజ్ చనిపోతాడు. ల్యాండ్ డీలింగ్ గొడవ వల్లే నరసింహులు అనే వ్యక్తి గురురాజ్ మీద అటాక్ చేసి చంపేస్తాడని అంతా అనుకుంటారు. గురురాజ్ పెద్ద కొడుకు కాళీ(జగపతి బాబు) తండ్రిని చంపిన వాడిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. రెండో కొడుకు గోపీ(వడ్డే నవీన్) ఇప్పటికైనా గొడవలు వద్దంటూ వారిస్తుంటారు. ముందు నుండీ ఈ గొడవలకు దూరంగా ఉండే రాధ మత్రం తండ్రి మరణంతో కాళి అన్నకు అండగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. అయితే దురదృష్ట వశాత్తు....నరసింహులు కోసం వెళ్లిన కాళి కూడా ఎటాక్ జరిగి చనిపోతాడు. అసలు గురురాజ్, కాళిలను చంపింది ఎవరు? తండ్రిని, అన్నను చంపిన వారిని రాధ ఎలా కనిపెట్టాడు, వారిపై ఎలా పగ తీర్చుకున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.
    **Note:Hey! Would you like to share the story of the movie ఎటాక్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X