X
అత్తరింటికి దారేది
Action | Romance | 27 Sep 2013 | U |
Telugu

అత్తరింటికి దారేది స్టోరీ

అత్తరింటికి దారేది సినిమా యక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, ప్రణీత, సమంత, నదియా , కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయ,బొమన్ ఇరాని, ముఖేష్ రుషి, శ్రీనివాస రెడ్డి, తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్వహించారు, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈచిత్రానికి సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు.

కథ

ఇటిలీలో ఉంటే అపర కుబేరుడు రఘు నందన్(బొమన్ ఇరాని)కి ముద్దుల మనవడు గౌతమ్‌ నందా (పవన్‌ కల్యాణ్‌). ఆరడుగుల బుల్లెట్‌లాంటి అతన్ని ఓ రోజు తాతగారు పిలిచి...ప్రతీ పుట్టిన రోజుకి నేను నేను గిప్ట్ ఇస్తున్నాను. ఈ పుట్టిన రోజుకి... నాకు నువ్వు గిప్ట్ ఇవ్వాలి. అది మరేదో కాదు...నా నుంచి విడిపోయిన నా కూతురు అంటే నీ మేనత్త సునంద(నదియా)ని ఇండియా నుంచి తీసుకు రావాలి అని అడుగుతాడు. దానికి సరేనన్న గౌతమ్ ...తాతయ్య కి ఇచ్చిన మాట కోసం.. ఇండియా వస్తాడు. ఇక్కడ తన పేరు సిద్దార్థ్‌గా మార్చుకొంటాడు. సునందకి ఉన్న ఆస్తి ఫైవ్ స్టార్ హోటల్ అప్పుల్లో ఉందని తెలుసుకుంటాడు. సునంద భర్త(రావు రమేష్)ని యాక్సిడెంట్ ని కాపాడి... తానెవరో చెప్పకుండా ఓ సాధారణ డ్రైవర్‌గా ఆ ఇంటిలో చేరతాడు. అక్కడ తన మరదళ్లు ప్రమీల( ప్రణీత), శశి (సమంత) ని చూస్తాడు. అక్కడ నుంచి తనదైన శైలిలో ఆటప్రారంభించి,తన పొగరుమోతు అత్త సమస్యలని తీర్చి ఆ కుటుంబానికి దగ్గరవటానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఎన్నో కొత్త సమస్యలు తలెత్తుతాయి. అవి ఏమిటి... తన అత్త మనస్సు మార్చి తన తాత అడిగిన గిప్ట్ ని ఇవ్వగలిగాడా అనేది మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+