ఆటోనగర్ సూర్య సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ చిత్రం ఇందులో నాగచైతన్య, సమంత, సాయికుమార్, కిమాయా, బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి, అజయ్, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, దువ్వాసి మోహన్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, అజయ్ ఘోష్ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా నిర్వహించారు మరియు ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు.
కథ
చిన్నప్పడే తల్లి తండ్రులని కోల్పోతాడు సూర్య(నాగ చైతన్య). తర్వాత అతన్ని ఆటోనగర్ లోని మెకానిక్ చేరదీయటంతో అక్కడ పెరుగుతాడు. అయితే అనుకోని పరిస్ధితుల్లో అక్కడున్న పరిస్ధితులకి ఎదురుతిరిగి మర్డర్ కేసులో ఇరుక్కుని చిన్నవయస్సులోనే జైలుకు వెళతాడు. జైలర్(తణికెళ్ళ)సాయింతో జైలులో చదువుకుని విడుదలై ఆటోనగర్ కి వచ్చిన సూర్య తన తెలివి ఉపయోగించి బ్యాటరీతో కారు తయారు చేయాలనుకుంటాడు.
కానీ ఇప్పుడు ఆటోనగర్ ని ఇంద్ర(జయప్రకాష్ రెడ్డి), అజయ్ కలిసి గూండాయిజం చేస్తూంటారు. ఆటోనగర్ లో ఏం చేయాలన్నా వారి అనుమతి కావాలి. అలాంటి పరిస్ధితుల్లో ...సూర్య ఏం చేసాడు....అసలు ఇంద్ర వెనక మేయర్(మధు)కి సూర్యకి పర్శనల్ కక్ష ఏమిటి... సిరి(సమంత)కి సూర్య కు ఉన్న లవ్ స్టోరీ ఏమిటి.... అనే విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.