బాబు బాగా బిజీ సినిమా బాలీవుడ్ మూవీ 'హంటర్' కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా కామిడి రొమ్యాంటిక్ ఎంటర్టైనర్ ఇందులో అవసరాల శ్రీనివాస్, తేజస్వీ, మిస్తీ చక్రవర్తి, శ్రీముఖి, సుప్రియ, ప్రియదర్శిని, ఆదర్స్ బాలకృష్ణ, తనికెళ్ళ భరణి, సుధ, అన్నపూర్ణ, పొసాని కృష్ణ మురళి, రవి ప్రకాష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నవీన్ మేడారం నిర్వహించారు మరియు హిందీ చిత్రాన్ని నిర్మించిన ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థ తెలుగు చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం సునిల్ కౌశ్యప్ స్వరాలు సమకుర్చరు.
కథ
మాధవ్ (అవసరాల శ్రీనివాస్) చిన్నతనం నుంచి తుంటరి. స్కూల్ కెళ్లే వయసు నుంచే పెద్దలకు మాత్రమే లాంటి సినిమాలు చూడటం, స్వాతి వార పత్రికలో శృంగార సమస్యలకు పరిష్కారం లాంటి శీర్షికలు చదవడం అలవాటు. అలా పెద్ద పెరిగిన తర్వాత ఏ అమ్మాయి కనిపించినా వెంటపడటం, మచ్చిక చేసుకొని సుఖాన్ని పొందడం వెన్నతోపెట్టిన విద్య. కాలేజీ, రెంట్‌కు ఉంటే అపార్ట్‌మెంట్, పార్కులు, పబ్లిక్ ప్లేసులు, ఆఫీస్ ఇలాంటి ఏ ప్లేస్ అయినా అమ్మాయిలకు వల వేయడంలో నెంబర్‌వన్ హంటర్. ఇలా అనేక విధాలుగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. పెళ్లి అనేది జీవితంలో వేస్ట్ అనే భావనతో ఉంటాడు. కానీ ఓ దశలో మాధవ్‌కు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. ఆ క్రమంలో పెళ్లి చూపులు తంతు మొదలవుతుంది. తన జీవితం గురించి నిజాలు చెప్పి వారిని ఆకట్టుకోవడంలో విఫలమవుతాడు. ఆ క్రమంలో ఓ అమ్మాయిని ఇష్టపడుతాడు. ఆ అమ్మాయికి అప్పటికే ఓ అఫైర్ ఉంటుంది. ఎంగేజ్‌మెంట్ బ్రేక్ అవుతుంది. ఆ అమ్మాయికి నచ్చినా మాధవ్‌ను పెళ్లి చేసుకోవడంపై క్లారిటీ ఇవ్వదు. చివరికి ఆ అమ్మాయికి మాధవ్‌కు పెళ్లి అయిందా? మాధవ్ జీవిత ప్రయాణంలో చంద్రిక (సుప్రియ) అనే గృహిణి, డాన్సర్, తేజస్విని, శోభ (శ్రీముఖి)లు ఎదురుపడుతారు. వారితో మాధవ్‌కు ఎదురైన సెక్స్ అనుభవాలు ఏమిటీ? వాటి వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే బాబు బాగా బిజీ.