X
Home టాప్ లిస్టింగ్

ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానున్న తెలుగు మూవీస్ లిస్ట్

Author Administrator | Updated: Wednesday, February 1, 2023, 12:35 PM [IST]

2023 ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న తెలుగు మూవీస్ మైఖేల్‌, అమిగోస్, సార్, రైటర్ పద్మభూషణ్, బుట్టబొమ్మ థియేట‌ర్ల ద్వారా తెలుగు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. బాక్సాఫీస్ వ‌ద్ద సినిమాలు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మ‌య్యాయి. 2023 ఫిబ్రవరిలో మొత్తం 15 సినిమాలు పైగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత పెద్ద మూవీస్ ఏవి రిలీజ్ కాలేదు అలానే ఫిబ్రవరి నెలలో కూడా ప్రేక్షకుల ముందుకు బిగ్ బ్యానర్ మూవీస్ రావటం లేదు.


cover image
రైటర్ పద్మభూషణ్
1

షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి, యూట్యూబ్ లో వీడియోలు తీసుకుంటూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో హీరోగా వచ్చి ఓటీటీలో భారీ విజయం సాధించి స్టార్ అయిపోయాడు. కలర్ ఫోటో సినిమా భారీ హిట్ అవ్వడం, నేషనల్ అవార్డు రావడంతో సుహాస్ కి అవకాశాలు క్యూ కట్టాయి. సుహాస్ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఫిబ్రవరి 3న  రిలీజ్ కానుంది. 

మైఖేల్
2

సందీప్‌ కిషన్‌, దివ్యాంశ కౌశిక్‌ జంటగా రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో వచ్చిన సినిమా మైఖేల్. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, గౌతమ్ మీనన్, వరుణ్‌ సందేశ్‌, అనసూయ, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలలో నటించారు. మైఖేల్ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఫిబ్రవరి 3న రిలీజ్ కాబోతుంది.

సువర్ణ సుందరి
3

సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం సువర్ణసుందరి. లక్ష్మీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేంద్ర మాదారపు దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్,సత్యప్రకాశ్ తదితరులు నటించారు.

బుట్టబొమ్మ
4

మలయాళ సినిమా ‘కప్పేలా’కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ‘బుట్టబొమ్మ’ మూవీని శౌరి చంద్రశేఖర్ రమేశ్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా జనవరి 26న విడుదల కావాల్సింది కానీ వారం రోజుల పాటు వాయిదా వేసి ఫిబ్రవరి 4న బుట్టబొమ్మ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. 

పాప్ కార్న్
5

అవికా గోర్‌, సాయి రోన‌క్ తదితరులు నటించిన పాప్ కార్న్ మూవీ ఫిబ్రవరి 10న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.  ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మించారు . హీరోయిన్ అవికా గోర్ ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌టం విశేషం. ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వహించారు.

అమిగోస్
6

డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ మూడు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన పోస్టర్స్ అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి.  ఈ సినిమాను ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. సినిమాకి రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

సార్
7

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ , సంయుక్తా మీనన తదితరులు నటించిన   సార్ మూవీ  ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతుంది . సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించారు ఈ భారీ బడ్జెట్ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా. కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పై సెటైరికల్ గా ఈ సినిమాను తీసినట్టు టాక్.ఇక ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు బాగానే ఉన్నాయి.

వినరో భాగ్యము విష్ణు కథ
8

కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్దేశీ తదితరులు  నటించిన చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. విలేజ్‌ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా ఫిబ్రవరి  17న ఈ సినిమా విడుదల కానుంది.  

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+