X
బాబు బంగారం
Comedy | Romance | 12 Aug 2016 | U/A | 150 Mins
Telugu

బాబు బంగారం స్టోరీ

బాబు బంగారం సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, నయనతార, వెన్నెల కిశోర్ మురళి, బ్రహ్మాజి, పోసాని కృష్ణా మురళి, ప్రిద్వి, జబర్దస్థ్ వేణు, సంపత్ రాజ్, ప్రబాస్ శ్రీను, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మారుతి నిర్వహించారు మరియు నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గిబ్రాన్ స్వరాలు సమకుర్చరు. 

కథ

ఏసిపి కృష్ణ( వెంకటేష్) క్రైం బ్రాంచి ఏసీపీ. చాలా సున్నిత మనస్తత్వంగల జాలి పోలీస్. ఉద్యోగ ధర్మంలో భాగంగా క్రిమినల్స్ ను కొట్టడం, తర్వాత జాలితో తానే స్వయంగా దగ్గరుండి వైద్యం చేయించడం, వారు త్వరగా కోలుకోవాలని పూజలు చేయించే రకం. శైలు(నయనతార) ఓ మెస్ నడుపుతూ తన ముగ్గురు చెల్లెల్లను పోషిస్తూ చాలా కష్టాలు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. ఆమె మంచి మనసు, అందం చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిన కృష్ణ ఎలాగైనా ఆమె సహాయం చేయాలనుకుంటాడు. ఆమెకు దగ్గరవ్వడానికి శైలు బావ బత్తాయికాల బాబ్జీ(పృథ్వి)ని వాడుకుంటాడు. శైలు కుటుబానికి సహాయం చేస్తూ ఆమెకు దగ్గరవ్వడంతో పాటు తన మసులో ఉన్న ప్రేమ విషయం చెబతాడు. కృష్ణ మంచి తనం చూసి శైలు కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఇన్ కం టాక్స్ ఆఫీసరైన శైలు తండ్రి (వి. జయప్రకాష్) తన సహోద్యోగిని హత్య చేసిన కేసులో పరారీలో ఉంటాడు. అతని కోసం ఇటు పోలీసులతో పాటు ఎమ్మెల్యే పుచ్చప్ప(పోసాని), మేయర్ కావాలని ఆశ పడుతున్న రౌడీ షీటర్(సంపత్ రాజ్) వెతుకుతుంటారు. కృష్ణ తనకు దగ్గరవ్వడం వెనక పోలీస్ సీక్రెట్ ఆపరేషన్ ఉందని, హత్య కేసులో పరారీలో ఉన్న తన తండ్రిని అరెస్టు చేయడానికే కృష్ణ తనను ప్రేమించినట్లు నటించి మోసం చేసాడని అతన్ని చీదరించుకుంటుంది శైలు. మరి శైలును నిజంగానే ప్రేమించిన కృష్ణ మళ్లీ ఆమెకు ఎలా దగ్గరయ్యాడు? కృష్ణ ఇన్వెస్టిగేషన్లో తేలిన నిజాలేమిటి? అనేవి తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+