X
తెలుగు » సినిమాలు » బాబు బంగారం
బాబు బంగారం

బాబు బంగారం

Comedy | Romance | 12 Aug 2016 | U/A | 150 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

బాబు బంగారం స్టోరీ

బాబు బంగారం సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, నయనతార, వెన్నెల కిశోర్ మురళి, బ్రహ్మాజి, పోసాని కృష్ణా మురళి, ప్రిద్వి, జబర్దస్థ్ వేణు, సంపత్ రాజ్, ప్రబాస్ శ్రీను, చమ్మక్ చంద్ర  తదితరులు ఇతర పాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మారుతి నిర్వహించారు మరియు నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గిబ్రాన్ స్వరాలు సమకుర్చరు.  కథ ఏసిపి కృష్ణ( వెంకటేష్) క్రైం బ్రాంచి ఏసీపీ. చాలా సున్నిత మనస్తత్వంగల జాలి పోలీస్. ఉద్యోగ ధర్మంలో భాగంగా క్రిమినల్స్ ను కొట్టడం, తర్వాత జాలితో తానే స్వయంగా దగ్గరుండి వైద్యం చేయించడం, వారు త్వరగా కోలుకోవాలని పూజలు చేయించే రకం. శైలు(నయనతార) ఓ మెస్ నడుపుతూ తన ముగ్గురు చెల్లెల్లను పోషిస్తూ చాలా కష్టాలు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. ఆమె మంచి మనసు, అందం చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిన కృష్ణ ఎలాగైనా ఆమె సహాయం చేయాలనుకుంటాడు. ఆమెకు దగ్గరవ్వడానికి శైలు బావ బత్తాయికాల బాబ్జీ(పృథ్వి)ని వాడుకుంటాడు. శైలు కుటుబానికి సహాయం చేస్తూ ఆమెకు దగ్గరవ్వడంతో పాటు తన మసులో ఉన్న ప్రేమ విషయం చెబతాడు. కృష్ణ మంచి తనం చూసి శైలు కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఇన్ కం టాక్స్ ఆఫీసరైన శైలు తండ్రి (వి. జయప్రకాష్) తన సహోద్యోగిని హత్య చేసిన కేసులో పరారీలో ఉంటాడు. అతని కోసం ఇటు పోలీసులతో పాటు ఎమ్మెల్యే పుచ్చప్ప(పోసాని), మేయర్ కావాలని ఆశ పడుతున్న రౌడీ షీటర్(సంపత్ రాజ్) వెతుకుతుంటారు. కృష్ణ తనకు దగ్గరవ్వడం వెనక పోలీస్ సీక్రెట్ ఆపరేషన్ ఉందని, హత్య కేసులో పరారీలో ఉన్న తన తండ్రిని అరెస్టు చేయడానికే కృష్ణ తనను ప్రేమించినట్లు నటించి మోసం చేసాడని అతన్ని చీదరించుకుంటుంది శైలు. మరి శైలును నిజంగానే ప్రేమించిన కృష్ణ మళ్లీ ఆమెకు ఎలా దగ్గరయ్యాడు? కృష్ణ ఇన్వెస్టిగేషన్లో తేలిన నిజాలేమిటి? అనేవి తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.
Read More

బాబు బంగారం కాస్ట్ & క్రూ

బాబు బంగారం సిబ్బంది సమాచారం

దర్శకత్వం మారుతి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గిబ్రాన్
నిర్మాత సూర్యదేవర నాగవంశీ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బాబు బంగారం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
వెంకటేష్ పెర్ఫార్మెన్స్, నయనతార అందం ఈ సినిమా హైలెట్. పోలీసాఫీర్ పాత్రలో వెంకీ లుక్స్ సూపర్బ్. నయనతార తన అందంతో పాటు, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఓ వైపు కామెడీ పండిస్తూనే తనదైన స్టైల్ లో సీరియస్ గా సీరియస్ గా కథలో ఇన్వాల్వ్ అవ్వడం ఆకట్టుకుంటుంది. కామెడీ విషయానికొస్తే ఫస్టాఫ్ లో బత్తాయికాల బాబ్జీ పాత్రలో పృథ్వి మరోసారి తనదైన మేనరిజంతో అదరగొట్టాడు. వెంన్నెల కిషోర్ ఓకే. సెకండాఫ్ లో బ్రహ్మానందం కాసేపు ఎంట్రీ ఇచ్చినా పెద్దగా నవ్వులు పండలేదు. కామెడీ విలన్ పాత్రలో పోసాని కృష్ణ మురళి మరోసారి తనదైన మార్క్ చూపించారు. రౌడీ షీటర్ గా సంపత్ రాజ్, ఫిష్ వెంకట్ తదితరులు ఫర్వాలేద. ఈ సినిమాకు పెద్ద మైనస్ కథే. కొత్తదనం లేక పోవడం, రొటీన్ గా ఉండటంతో పెద్దగా ప్రేక్షకుల్లో ఆసక్తి లేకుండా పోయింది. కనీసం స్క్రీన్ ప్లే తో అయినా దర్శకుడు ప్రేక్షకుడిలో సినిమాపై ఆసక్తి పెంచాడా అంటే అదీ లేదు. ఫస్టాఫ్ వెంకీ స్టైల్ లో నాలుగు కామెడీ సీన్లు, ఫారిన్ లొకేషన్లలో పాటలతో నింపేసాడు కాబట్టి ప్రేక్షకులు కాస్త ఎంజాయ్ చేసారు. ఇక సెకండాఫ్ వచ్చేసరికి సాగదీసినట్లు ఉండే కథనం, బోరింగ్ సీన్లతో ప్రక్షకుల మూడ్ చేంజ్ అయింది. సినిమా ఇంకా ఎప్పుడు అయిపోతుందనే ఫిలింగ్ కలిగించారు.

బాబు బంగారం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బాబు బంగారం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+